ఉత్తమ బిఎల్ఓలకు ప్రశంస పత్రాలు ఇచ్చిన తాసిల్దార్ రాణి

*ఉత్తమ బిఎల్ఓలకు ప్రశంస పత్రాలు ఇచ్చిన తాసిల్దార్ రాణి*

IMG 20250126 WA0118

ఇల్లందకుంట జనవరి 26 ప్రశ్న ఆయుధం*

ప్రభుత్వం ఇచ్చిన విధులను సమర్థవంతంగా నిర్వహించినందుకు ఉత్తమ బిఎల్ఓ గా శ్రీరాములపల్లి కారోబార్ తిప్పారపు వీరన్న, సీతంపేట అంగన్వాడి టీచర్ రబియా, అంగన్వాడి టీచర్ వనమాలకు తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ రాణి ప్రశంస పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా తాసిల్దార్ రాణి మాట్లాడుతూ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రజలకు చేరువ చేయాలని ఉద్దేశంతో ఉద్యోగుల యొక్క శ్రమను గుర్తించి ప్రశంస పత్రాలను అందజేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ పార్థసారథి ఆర్ఐ నాగరాజు జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment