మహిళా VROపై లైంగిక వేధింపులు.. తహసీల్దార్ సస్పెండ్
Aug 01, 2025,
ఆంధ్రప్రదేశ్ : మహిళా వీఆర్వోపై లైంగిక వేధింపులకు పాల్పడిన తిరుపతి జిల్లా వాకాడు మండల తహశీల్దార్ రామయ్యను జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సస్పెండ్ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. నాయుడుపేట బీఎంఆర్ నగర్లో నివాసం ఉంటున్న వీఆర్వో ఇంటికి కొన్ని రోజుల క్రితం తహసీల్దార్ వెళ్లాడు. అది గమనించిన VRO తల్లి తహశీల్దార్‌కు దేహశుద్ధి చేసిన వీడియోలు గురువారం SMలో వైరల్ అయ్యాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు తహశీల్దార్‌ను కలెక్టర్ సస్పెండ్ చేశారు.