మెదక్/నర్సాపూర్, ఆగస్టు 19 (ప్రశ్న ఆయుధం న్యూస్): భారతీయ జనతాపార్టీ జిల్లా పార్టీ పిలుపు మేరకు నర్సాపూర్ మండలంలో సమస్యలు పరిష్కరించాలని పార్టీ మండల అధ్యక్షుడు నీలి నాగేష్, పట్టణ అధ్యక్షుడు నీరుడి చంద్రయ్య ఆధ్వర్యంలో మంగళవారం తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. నర్సాపూర్ మండలంలో డబుల్ బెడ్ ఇళ్లు ప్రజలకు పంచాలని, వర్షానికి పెంకుటిల్లు కూలిపోయాయని, ఇండ్ల పైన చెట్లు పడడం, వర్షం వల్ల దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిన్న రమేష్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి సంగసాని సురేష్, జిల్లా ఉపాధ్యక్షుడు నారాయణరెడ్డి, ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షుడు గుండం శంకర్, పట్టణ ప్రధాన కార్యదర్శిలు రాంరెడ్డి, సంగసాని రాజు, కిసాన్ మోర్చా అధ్యక్షుడు శ్రీకాంత్ యాదవ్, నర్సాపూర్ మండల ఉపాధ్యక్షులు సంజీవ్ రెడ్డి, సంతోష్ నాయక్, బూత్ అధ్యక్షుడు దుర్గా ప్రసాద్, గణేష్, మహేష్, శ్రీనివాస్, మహేష్, కృష్ణ, నరేష్ తదితరులు పాల్గొన్నారు
నర్సాపూర్ మండలంలో సమస్యలు పరిష్కరించాలని తహసీల్దార్ కు వినతి
Oplus_131072