Site icon PRASHNA AYUDHAM

భవిత కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి ఎం ఈ ఓ బట్టు రాజేశ్వర్

IMG 20250312 WA0081

*భవిత కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి ఎం ఈ ఓ బట్టు రాజేశ్వర్*

ప్రశ్న ఆయుధం మార్చి 12:బాల్కొండ: ప్రత్యేక అవసరాలున్న చిన్నారుల కోసం, వారిలో మార్పుకోసం ఏర్పాటు చేసిన భవిత విద్యావనరుల కేంద్రం సేవలను చిన్నారుల తల్లిదండ్రులు సద్వినియోగపర్చుకోవాలని మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్ ఒక ప్రకటనలో తెలిపారు

ప్రత్యేక అవసరాలున్న చిన్నారుల కోసం, వారిలో మార్పుకోసం ఏర్పాటు చేసిన బాల్కొండ భవిత విద్యావనరుల కేంద్రం సేవలను చిన్నారుల తల్లిదండ్రులు సద్వినియోగపర్చుకోవాలని ఆయన అన్నారు.. ఈ సందర్భంగా ఫిజియోథెరఫిస్ట్‌, ఉపాధ్యాయులు అందిస్తున్న శిక్షణ ద్వారా చిన్నారుల్లో గుణాత్మక మార్పులు వస్తాయన్నారు. ప్రతి రోజు ఇంటి వద్ద కూడా చిన్నారులకు తల్లిదండ్రులు వ్యాయామం చేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఫిజియోథెరపీస్ట్‌ ఇందిరా , ఐఈఆర్‌టీలు రాజ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version