*పల్లె యాత్ర లో భాగంగా సమితి సింగారం గ్రామ పంచాయతీ లోని రాజీవ్ గాంధీ నగర్, అశోక్ నగర్, డబుల్ బెడ్ రూమ్ లో పర్యటన .*
———– డబుల్ బెడ్ రూమ్ ఇల్లులకు పోవడానికి సరైన రోడ్డు లేవు, వీది లైట్లు లేవు మొత్తం బురద మాయం డబుల్ బెడ్ రూమ్ ఇల్లులు పేదలకు తక్షణమే కేటాయించాలి…!– రాజీవ్ గాంధీ నగర్ లో ఇల్లులు మద్య నీళ్ళు నిలిచి మడుగుల ఏర్పడి దోమలు ఈగలు నిల్వా ఉండి ప్రజలకు రోగాలు వస్తున్నాయి మా పరిస్థితి అగమ్య గోచారము అంటున్న ప్రజలు …!– యాత్రలో భాగంగా కర్నె రవి వ్యాఖ్యలు మణుగూరు మండలం లో సమితి సింగారం గ్రామ పంచాయతీ పరిధిలో ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయని, ప్రజల బాధలతో తల్లడిల్లుతోందని, కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాపాలన కాదు సమస్యల పాలన నడుస్తోందని మణుగూరుకు చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త అడ్వకేట్ కర్నె రవి తీవ్ర ఆరోపణలు చేశారు. సామాజిక కార్యకర్త కర్నె రవి ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ఈరోజు పల్లె యాత్ర లో భాగంగా మణుగూరు మండలంలోని సమితి సింగారం గ్రామ పంచాయతీ లోని రాజీవ్ గాంధీ నగర్ దగ్గర నుంచి పల్లెయాత్ర ప్రారంభించారు. ఈ యాత్రలో కర్నె రవి ప్రజలతో మాట్లాడి పలు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. యాత్రలో రాజీవ్ గాంధీ నగర్ లో రోడ్డు పైన కంకర పోసి సంవత్సరం గడిచిన ఈరోజు వరకు రోడ్డు పోయి లేదు అని ప్రజలు చెప్తున్నారు రోడ్డు పై పోతుంటే 🐶 కుక్కలు కరుస్తున్నాయి బ్లీచింగ్ పౌడర్ చల్లడం లేదు సైడు కాలువలు తీయడం లేదు అని ప్రజలు చెప్తున్నారు ఇళ్ల మధ్య నీళ్లు నిలిచి మడుగు ఏర్పాటై దోమలు స్థావరాలు ఏర్పాటు చేసుకొని ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్నారు డబల్ బెడ్రూంలో ఈరోజు వరకు కూడా కటాయించకపోవడం వల్ల పేదలు ఇల్లు లేక ఇబ్బంది పడుతున్నారు ప్రజల యొక్క ప్రధాన సమస్యలైన సైడ్ డ్రైనేజీ, విద్యుత్ వీధి లైట్లు, రోడ్లు లేవని ప్రజలు చెప్తున్నారు మేము చెప్పిన అధికారులు పట్టించుకోవడం లేదని సంవత్సరాల గడుస్తున్నా. మా సమస్యలు సమస్యలుగానే ఉండిపోతున్నాయి ప్రజలు తమ గోడు తెలిపారు. సామాజిక కార్యకర్త లాయర్ కర్నె రవి మరియు పినపాక నియోజకవర్గం యువజన నాయకుడు సాగర్ యాదవ్ కలిసి అధికారులతో మాట్లాడి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని రవి హామీ ఇచ్చారు…