*వేడిగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవాలి &కాచి చల్లార్చిన నీటిని మాత్రమే త్రాగాలి*
*సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో వైద్య శిబిరం*
*జమ్మికుంట జూన్ 30 ప్రశ్న ఆయుధం*
వర్షాకాలంలో వేడిగా ఉన్నప్పుడే ఆహార పదార్థాలను తినాలని కాచి చల్లార్చిన మంచినీటిని త్రాగాలని ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం వైద్య నిపుణులు డాక్టర్ మహోన్నత తెలిపారు సోమవారం రోజున జమ్మికుంట మండలంలోని వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని జమ్మికుంట మున్సిపల్ పరిధిలో గల బాలుర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల లో డాక్టర్ మహోన్నత పటేల్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు వైద్య శిబిరంలో దగ్గు, జలుబు వంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్న 23 మంది విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు ఈ సందర్బంగా వసతి గృహంలోని బాలురకు డాక్టర్ మహోన్నత పటేల్ హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్ రెడ్డి వ్యక్తి గత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, సీజనల్ వ్యాధులు మలేరియా, డెంగీ, చికెన్ గుణ్య, మెదడువాపు, టైఫాయిడు, జాండిస్ మొదలగు వ్యాధులు వ్యాపించు విధానం, వ్యాధుల లక్షణాలు, తీసుకోవలసిన జాగ్రత్తలను బయటి తిను బండారాల జోలికి వెళ్ళవద్దని వేడిగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవాలని కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని విద్యార్థులకు సూచించినారు.ఈ కార్యక్రమములో ఎంఈఓ హేమలత డాక్టర్ మహోన్నత పటేల్, హెల్త్ ఎడ్యుకేటరు మోహన్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ జే రామ్ సింగ్, డాక్టర్ శ్రీధరచారి,హెల్త్ అసిస్టెంట్ నరేందర్,ఏఎన్ఎం రజిత ఆశా కార్యకర్త రహిమా సుల్తానా విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు