*మున్సిపాలిటీ అభివృద్ధిలో ఛైర్మెన్ గా తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న తక్కల్లపల్లి*
*మున్సిపాలిటీ తాజా మాజీ చైర్మన్ ను ఘనంగా సన్మానించిన స్థానిక ప్రజలు*
*జమ్మికుంట జనవరి 28 ప్రశ్న ఆయుధం*
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీలోని ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలకు స్పందించి సకాలంలో పరిష్కరించి పట్టణ అభివృద్ధికి తోడ్పడి, ప్రజల మనసులో జమ్మికుంట మున్సిపాలిటీ చైర్మెన్ గా తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న తక్కల్లపెళ్లి రాజేశ్వరరావు ను మంగళవారం తన నివాసంలో ప్రజలు, సన్నిహితులు,అభిమానులు, పలు వార్డుల పెద్దమనుషులు శాలువాలతో ఘనంగా సన్మానించారు అనంతరం వారు మాట్లాడుతూ ఐదు సంవత్సరాలు చైర్మెన్ గా సేవలందించి ప్రజల మన్ననలు పొందారాని పట్టణ అభివృద్ధిలో తనదైన ముద్ర వేసుకున్నాడని కొనియాడారు. మున్సిపాలిటీలోని ముప్పై వార్డులో ప్రతి గల్లీలో సిసి రోడ్లు,డ్రైనేజీలు నిర్మించి, త్రాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంటింటికి నల్ల కలెక్షన్ ఇచ్చి నీటి సౌకర్యం కల్పించారని తెలిపారు ఐదు సంవత్సరాలుగా మున్సిపాలిటీ ప్రజలకు ఎంతో సేవ చేశారాని ప్రజలకు చేసిన సేవలు మరువలేనివి అని చెప్పారు. ఈ కార్యక్రమంలో భూపతి సంతోష్, నరసన్న, రాజగోపాల్, సతీష్, చందు, రమేష్,ఋషి, సాగర్, సంపత్,గంగన్న, అశోక్, కిరణ్,చారి,రమేష్,జగదీశ్వర్, రామ్మూర్తి, రామన్న, ఎల్లయ్య,చిరంజీవి,రవి, మహేష్ వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.