తలమడ్ల వార్డు సభ్యులకు శాలువాలతో ఘన సత్కారం
గ్రామీణ స్థాయిలో కాంగ్రెస్ బలపడుతోంది :
టీపీసీసీ స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం డిసెంబర్ 30
రాజంపేట మండలం తలమడ్ల గ్రామానికి చెందిన ఇటీవల గెలుపొందిన వార్డు సభ్యులను టీపీసీసీ స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమం మంగళవారం కామారెడ్డి పట్టణంలోని గడ్డం చంద్రశేఖర్ రెడ్డి నివాసంలో జరిగింది. ఈ సందర్భంగా తలమడ్ల గ్రామ వార్డు సభ్యులు కామాపురం సురేష్, రంగా రేవతి కిషన్, పెట్టిగాడి రాజమణి యశ్వంత్, వేణు చారి, యూత్ అధ్యక్షులు గంగారాం తదితరులను ప్రత్యేకంగా సన్మానించారు. అనంతరం గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామీణ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ మరింత బలపడుతోందని అన్నారు. సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు సమన్వయంతో పనిచేసి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలలోకి తీసుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ కౌన్సిలర్లు జూలూరు సుధాకర్, సేవాదళ్ అధ్యక్షులు నర్సుల మహేష్, బండారి శ్రీకాంత్ తదితరులు పాల్గొని నాయకులకు అభినందనలు తెలిపారు.