గ్రామాలకు దూరంగా ఉన్న తండాలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేయాలీ 

గ్రామాలకు దూరంగా ఉన్న తండాలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేయాలీ

– లంబాడి హక్కుల పోరాట సమితి

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి

(ప్రశ్న ఆయుధం) జులై 8

 

కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లంబాడ హక్కుల పోరాట సమితి నాయకులు మాట్లాడుతూ మా తండాలో మా రాజ్యం, అనే నినాదంతో గ్రామాలకు దూరంగా ఉన్న తండాలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేయాలని, మేమెంతో మాకంతా వాటా కావాలనే నినాదంతో తేజావత్ బేల్లయ్య నాయక్ నాయకత్వంలో లంబాడి హక్కుల పోరాట ఫలితంగా గత కెసిఆర్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో 3000 వేలకు పైగా నూతన గ్రామపంచాయతీలను ఏర్పాటు చేసుకొని

మా తండాలో మా రాజ్యం లక్ష్యాన్ని సాధించిందన్నారు. మేమెత మందిమో మాకంత వాటా కావాలని, జనాభా దామాషా ప్రకారం గిరిజనులకు రిజర్వేషన్లను పెంచాలని ఆరు శాతంగా ఉన్న గిరిజన రిజర్వేషన్లను 10 శాతానికి గత ప్రభుత్వంలో పెంచేల చేసుకున్నాం ! ఇది లంబాడి హక్కుల పోరాట సమితి విజయం అన్నారు. లంబాడీల భాష గోర్ బోలి ని 8 వ షెడ్యూల్లో చేర్చడం కోసం లంబాడి హక్కుల పోరాట సమితి పోరాటంతో ప్రస్తుత ప్రభుత్వం తెలంగాణ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపే విధంగా చేసుకున్నాం అని, లంబాడి హక్కుల పోరాట సమితి పోరాటం చేసి ఎన్నో సమస్యలను సాధించుకునం భవిష్యత్తులో నిరంతరంగా లంబాడి జాతి ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయడంలో ముందు వరుసలో ఉంటదని విద్యార్థుల, ఉద్యోగుల, రైతుల , మహిళల పక్షాన లంబాడి జాతికి ఏ అన్యాయం జరిగినా లంబాడి హక్కుల పోరాట సమితి చూస్తూ ఊరుకోదని, అందుకోసమే రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లంబాడీలను ఐక్యం చేస్తూ భవిష్యత్తులో పోరాటంలో లంబాడి హక్కుల పోరాట సమితి కార్యకర్తలు ముందుండాలని కోరుతున్నాము అన్నారు. కామారెడ్డి జిల్లా అన్ని మండల కమిటీలు అతి త్వరలో వేయడం జరుగుతుందన్నారు. లంబాడీ హక్కుల పోరాట సమితి కామారెడ్డి జిల్లా అధ్యక్షులు నునావత్ గణేష్ నాయక్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో లంబాడా హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి గుగులోత్

వినోద్ నాయక్, కామారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి బద్రి నాయక్, జిల్లా గౌరవ అధ్యక్షులు రూప్ సింగ్ నాయక్,

వర్కింగ్ ప్రెసిడెంట్ శంకర్ నాయక్, యువజన జిల్లా అధ్యక్షులు ప్రేమ్ నాయక్, విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రకాష్ నాయక్, ఎల్లారెడ్డి డివిజన్ అధ్యక్షులు బానోత్ మధన్ లాల్ నాయక్, విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దేవి సింగ్ నాయక్,

గాంధారి మండల అధ్యక్షులు పరశురాం నాయక్, కామారెడ్డి టౌన్ అధ్యక్షుడు మోహన్ నాయక్, ముఖ్య అతిథులుగా ఏఐబిఎస్ఎస్ గాంధారి మండల అధ్యక్షులు సక్రం నాయక్, ప్రధాన కార్యదర్శి ప్రేమ్ కుమార్ జాదవ్ , నాయకులు చందర్ , శీను, హరిలాల్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now