*టీచర్లు తలుచుకుంటే సర్కార్ తలరాతలే మారతాయి*
*ప్రజా సమస్యలపై ప్రజాస్వామ్యబద్దంగా పోరాడే వాళ్లకు నేను సంపూర్ణంగా మద్దతిస్తా*
*కాంగ్రెస్ ఉన్నంతకాలం మీ సమస్యలు తీరవు*
*ఉద్యోగులకు మొదటి నెల జీతం బీజేపీ పోరాట ఫలితమే*
*317 జీవోతో టీచర్లు అల్లాడితే ఉపాధ్యాయ సంఘాలెందుకు నోరు విప్పలే?*
*టీచర్ల పక్షాన కొట్లాడి జైలుకు వెళ్లిన ఏకైక సంఘం తపస్ మాత్రమే*
*టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏవీఎన్ రెడ్డికి జోడీని గెలిపించండి*
*బీఈడీ అర్హతలున్న ఎస్జీటీ టీచర్లకు ప్రమోషన్లను న్యాయం జరిగేలా క్రుషి చేస్తా*
*పాఠ్యాంశాల్లో నక్సలైట్ల సిద్దాంతాలను, కమ్యూనిస్టు మూలాలను చొప్పించే కుట్ర జరుగుతోంది*
*సమాజాన్ని భ్రష్టు పట్టించే కుట్రలను చేధిద్దాం*
*ఉపాధ్యాయ సంఘాలకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పిలుపు*
*కరీంనగర్ తపస్ ‘గురు వందనం’లో పాల్గొని పలువురు ఉత్తమ టీచర్లను సన్మానించిన కేంద్ర మంత్రి*
*కరీంనగర్ ప్రశ్న ఆయుధం న్యూస్ బ్యూరో సెప్టెంబర్ 8*
ఉపాధ్యాయులు తలుచుకుంటే సర్కార్లు మారుతాయని ఉపాధ్యాయుల సమస్యలపై కొట్లాడి జైలుకు వెళ్లిన ఏకైక సంఘం తపస్ అని ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏవిఎన్ రెడ్డికి జోడీ ని గెలిపించాలని మీకోసం మేం కొట్లాడినం. పీఆర్సీ, డీఏ, బదిలీలు, ప్రమోషన్ల కోసం మేం యుద్దం చేసినం. 317 జీవోపై ఏకంగా జైలుకు వెళ్లినం కానీ కాంగ్రెస్ కు ఓటేసి గెలిపించారు. కాంగ్రెస్ పాలనలో మీకు ఒరిగిందేమిటి?’’ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రాష్ట్రంలోని ఉపాధ్యాయ సంఘాలను ప్రశ్నించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ దొందూ దొందే. పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్లుందని రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన సర్కార్ వల్ల సమస్యలు పరిష్కారమయ్యే అవకాశమే లేదని మళ్లీ రొడ్డెక్కి యుద్దం చేస్తేనే మీ సమస్యలు పరిష్కారమవుతాయని ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజాస్వామ్యబద్దంగా మీరు చేసే పోరాటాలకు నేను మద్దతిస్తా అని స్పష్టం చేశారు. కరీంనగర్ కలెక్టరేట్ లో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం కరీంనగర్ జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన ‘గురు వందనం’ కార్యక్రమంలో బండి సంజయ్ తోపాటు టీచర్ ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి తపస్ రాష్ట్ర నాయకులు కట్టా రాజేశ్వర్ హనుమంతరావు తిరుపతిరావు హాజరై బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ ఇక్కడికి వస్తే క్లాస్ రూంలో ఉన్నట్లుందని తల్లిదండ్రుల తర్వాత అత్యంత ప్రాధాన్యత గురువులదే నని అందుకే మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అనే సూక్తిని మనమంతా వింటూనే ఉన్నామని ఆ స్థానంలో ఉన్న మీ అందరికీ ముందుగా గురువందనం సమర్పిస్తున్నానని తపస్ చేస్తున్న సేవలు అభినందనీయమని దీనదయాళ్ ఉపాధ్యాయ చెప్పినట్లుగా అణు పరీక్షలు నిర్వహించిన ఘనత వాజ్ పేయిదే అయితే శ్యామాప్రసాద్ ముఖర్జీ స్పూర్తితో 370 ఆర్టికల్ రద్దు చేసిన ఘనత మోదీదే. భారతమాతను విశ్వగురు స్థానంలో నిలబెట్టాలని తపిస్తున్న మహనీయుడు నరేంద్రమోడి అని అట్లాగే మన పెద్దలు కలలు కన్న నవ సమాజాన్ని రూపొందించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని దురద్రుష్టమేందంటే దేశమంతా ఒకవిధంగా పరిస్థితులుంటే… రాష్ట్రంలో మాత్రం భిన్నమైన పరిస్థితులున్నయని కాంగ్రెస్ పాలన పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్లుందని అన్నారు
కాంగ్రెస్ కు ఓట్లేసిన పాపానికి మీకు డీఏల రాలేదని పీఆర్సీ లేదని చివరకు రిటైర్డ్ అయితే పెన్షన్ పైసలు వచ్చే పరిస్థితి లేదని ఆనాడు కొన్ని ఉపాధ్యాయ సంఘాలు కేసీఆర్ మోచేతి నీళ్లు తాగి ఉపాధ్యాయుల సమస్యలను పట్టించుకోలేదని ఊరంతటినీ, యావత్ సమాజాన్ని ప్రభావం చేసే సత్తా మీకే ఉందని మీతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం మనుగడ సాగించిన చరిత్ర లేదని సొంతంగా పార్టీ పెట్టి 9 నెలల్లోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రపంచ రికార్డు స్రుష్టించిన ఎన్టీఆర్ అంతటోడిని కూడా గద్దె దించిన చరిత్ర ఉపాధ్యాయ ఉద్యోగులదే చంద్రబాబు సర్కార్ ను 2004లో దించేసి వైఎస్.రాజశేఖర్ రెడ్డి సర్కార్ ను ఏర్పాటు చేయించింది ఉద్యోగులే అంతటి చరిత్ర ఉన్న ఉపాధ్యాయులకు కేసీఆర్ అరాచక పాలనకు భయపడి మౌన పాత్ర పోషించడం బాధాకరమని 317 జీవో పేరుతో చెట్టుకొకరిని పుట్టకొకరిని చేస్తే మీకోసం పోరాడి జైలుకు పోయింది బిజెపి నాయకులని మీ కుటుంబాలను ఏ విధమైన మానసిక వేదనకు గురిచేసిండో మేం ఇంకా మరవనేలేదని మా కార్యకర్తలంతా మీకోసం పెద్ద యుద్దమే చేసినారని కేసులు, లాఠీలకు భయపడకుండా యుద్దం చేసిర్రు. 317 జీవో తెస్తే మీకోసం నేను పోరాడి జైలుకు పోయిన. నా ఆఫీస్ గేట్లను, గోడను పోలీసులతో ఎట్లా ధ్వంసం చేయించిర్రో మీకు తెలుసు. ఇద్దరు మహిళా కార్యకర్తల కాళ్లు విరిగినయ్. చాలా మంది గాయపడ్డారు. ఆనాడు ఏ ఉపాధ్యాయ సంఘం మాకు మద్దతివ్వలే. తపస్ తప్ప. ప్రజా సమస్యలపై పోరాడి అత్యధిక కేసులున్న ఎంపీని నేను. నాపై 109 కేసులున్నయ్. ప్రజల కోసం రెండు సార్లు జైలుకు పోయిన. బాధేందంటే మీ తరపున, ప్రజల తరపున బీజేపీ పోరాటాలు చేస్తే… మీ కోసం మేం జైలుకు వెళితే… కాంగ్రెస్ కు అధికారం కట్టబెట్టారు.బీజేపీ అధికారంలోకి వచ్చి ఉంటే డీఏలు, ప్రమోషన్లు ఆగేవి కావని కేంద్రం పెండింగ్ డీఏలు ఇచ్చేయడమే ఇందుకు నిదర్శనమని మీకోసం కొట్లాడే పార్టీలను మీరే నిర్లక్ష్యం చేస్తే టీచర్లపై విశ్వాసం పోతోందని
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే టీచర్ల బతుకేలేమైనా మారినయా? 50 శాతం ఫిట్మెంట్ తో పీఆర్సీ ప్రకటిస్తామన్నరు కానీ బకాయిలన్నీ జమ చేస్తమన్నరు. ఇచ్చిర్రా? ఆ ఊసే లేదని మీకే కాదు 24 గంటలు డ్యూటీ చేస్తూ మనల్ని కాపాడే పోలీసులోళ్లకు కూడా డి ఏ డి ఏ లు లు ఇవ్వడం లేదని కరీంనగర్ జిల్లాలో 15 కోట్ల రూపాయల బకాయిలు పెట్టారని ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులన్నింట్లో హెల్త్ కార్డులు పనిచేసేలా చేస్తామని చేయలేదని మీ పూర్తి ఆసుపత్రి ఖర్చులను ప్రభుత్వం చెల్లిస్తుందా? రాష్ట్రవ్యాప్తంగా నూటికి 70 శాతానికిపైగా ఎంఈఓ, డిఈవో, డైట్ లెక్చరర్స్ పోస్టులు ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్నాయని గత ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని కేసీఆర్ ప్రభుత్వం 5 లక్షల కోట్ల అప్పు చేసిందని అందరికీ తెలుసునని అయినా ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ పరిష్కరిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటిని ఎందుకు అమలు చేయడం లేదని డబ్బులు లేవని తెలిసి కూడా ఎందుకు హామీలిచ్చారని మధ్యాహ్న భోజనం బాధ్యతల నుండి ప్రధానోపాధ్యాయులను తప్పించండి ప్రశాంతంగా పిల్లలకు పాఠాలు చెప్పుకుంటామని’’ మీరంతా మొత్తుకుంటున్నా పట్టించుకునే నాథుడే దిక్కులేడని స్కూళ్లలో విద్యార్థుల సమస్యలు అనేకం ఉన్నయ్. వాళ్ల కోసం ఎవరూ కొట్లాడాలే కాంగ్రెస్ సర్కార్ వల్ల సమస్యలు పరిష్కారమయ్యే అవకాశమే లేదని మళ్లీ రొడ్డెక్కి యుద్దం చేస్తేనే మీ సమస్యలు పరిష్కారమవుతాయని ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజాస్వామ్యబద్దంగా మీరు చేసే పోరాటాలకు మద్దతిస్తా.ఈ వేదికగా చెబుతున్నా.. మీకోసం మేమున్నం. మీ హక్కుల కోసం, మీ సమస్యల పరిష్కారం కోసం మేం కొట్లాడతామని మీరు సర్కారు బడి పిల్లలకు మంచి చదువు చెప్పాలని వాళ్లకు కనీస సౌకర్యాల కోసం కొట్లాడాలని గొంతెత్తి ప్రశ్నించలేని పేద కుటుంబాల నుండి చదువుకోవడానికి మీ దగ్గరకు వచ్చేటోళ్లకు మీరు భరోసా ఇవ్వాలని ఆనాడు బడి పంతులు జీతమెంత అంటే… బతకలేక బడి పంతులు ఉద్యోగం చేస్తున్నా…. అనేటోళ్లు… మరి ఇయాళ?…. బతకడానికి ఇబ్బంది లేనంతగా జీతం వస్తోందని పేర్కొన్నారు విద్యార్థులకు చదువు సంస్కారం విలువలను విద్యార్థులను బోధిస్తూ సమాజానికి గొప్పగొప్ప వాళ్లను అందించే పౌరులుగా తీర్చిదిద్దాలని కోరారు టీచర్లు తలుచుకుంటే తలరాతలే మారిపోతాయని ప్రభుత్వాలే కూలిపోతాయని పేర్కొన్నారు గతంలో టీచర్లతో పెట్టుకున్న ఏ ప్రభుత్వమూ మనుగడ సాధించలేదని విద్యార్థులు ఉపాధ్యాయులతోనే సమాజంలో మార్పు మొదలవుతోందని ఇగ మీకోసం కొట్లాడేటోడిని మీ హక్కుల కోసం పోరాడే నాయకుడిని ఎన్నుకునే అవకాశం టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక రూపంలో రాబోతోందని మంచి వ్యక్తిని ఎన్నుకోవాలని అందుకోసం ఇప్పటి నుండే అందరూ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని రాబోయే టీచర్ ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డికి జోడిని గెలిపించాలని కోరుతున్నా అని ఆయన అన్నారు బీఈడీ అర్హతలుండి ఎస్జీటీలుగా పనిచేస్తున్న టీచర్లకు ప్రమోషన్ల విషయంలో అన్యాయం జరుగుతున్న విషయం నా ద్రుష్టికి వచ్చిందని డీఈడీ అర్హతలున్న వారికే ప్రమోషన్లు రావడంతో సీనియర్లైన బీఈడీ టీచర్లు తీవ్ర వివక్షకు గురవుతున్నట్లు తెలిసిందని ఈ విషయాన్ని కేంద్రంలోని హెచ్ ఆర్ డీ శాఖ మంత్రి ద్రుష్టికి తీసుకెళ్లి ఎన్సీటీఈ (నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్) గైడ్ లైన్స్ లో మార్పులు చేయించేందుకు ప్రయత్నం చేస్తా అని అన్నారు పాఠ్యాంశాల్లో మళ్లీ నక్సలైట్ సిద్దాంతాలను, కమ్యూనిస్టు మూలాలను జొప్పించే కుట్ర జరుగుతోందని విద్యా వ్యవస్థను చిన్నాభిన్నం చేసే వ్యక్తులు చొరబడుతున్నారని ఎదురించి నిలువరించాల్సిన అవసరం మనందరిపైనా పేర్కొన్నారు ఈ సమావేశంలో పలువురు ఉపాధ్యాయురాలను ఉపాధ్యాయులను సన్మానించారు