సంగారెడ్డి ప్రతినిధి, మార్చి 2 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి తారా ప్రభుత్వ కళాశాలకు చెందిన అర్థశాస్త్ర అధ్యాపకుడు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ జగదీశ్వర్ ఒరిస్సాలో జరిగే ఎన్ఎస్ఎస్ జాతీయ సమైక్యత శిబిరానికి తెలంగాణ రాష్ట్రం తరపున పాల్గొని ఆరుగురు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పెండానికి కాంటినెంట్ లీడర్ గా ఎంపిక కావడం జరిగిందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రత్నప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ సహకారంతో ఒరిస్సా ఎన్ఎస్ఎస్ రీజినల్ డైరెక్టరేట్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఎన్ఎస్ఎస్ జాతీయ సమైక్యత శిబిరానికి తెలంగాణ రాష్ట్రం నుండి ఆరుగురు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు కలిగిన బృందం బయలు దేరుతుందని, ఈ బృందానికి కాంటినెంట్ లీడర్ గా తమ కళాశాలకు చెందిన ఎన్ఎస్ఎస్ అధికారి డాక్టర్ జగదీశ్వర్ ఎంపిక అయ్యారని చెప్పారు. ఈ ఎన్ఎస్ఎస్ జాతీయ సమైక్యత శిబిరము ఒరిస్సాలోని బరంపూర్ లోని, బరంపూర్ విశ్వ విద్యాలయంలో ఈనెల 3వ తేదీ నుండి 9 వరకు జరుగుతుందని, అందులో దేశం నలుమూలల నుండి వివిధ రాష్ట్రాలు పాల్గొని ఆయా రాష్ట్రాల సంస్కృతి, వారసత్వాలను వ్యాప్తి చెందిస్తాయని తెలిపారు. ఇందులో భాగంగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను, బతకమ్మ, బోనాలు తెలంగాణ శివతాండవం వంటి వివిధ సంస్కృతిక కార్యక్రమాలను వాలంటీర్లు ప్రదర్శించి తెలంగాణ రాష్ట్రానికి గుర్తింపును తీసుకొని వస్తారని అన్నారు. ఈ జాతీయ సమైక్యత శిబిరం యొక్క ప్రధాన లక్ష్యం వివిధ సంస్కృతి సాంప్రదాయాలు కలిగిన రాష్ట్రాలు సమైక్య భారత దేశాన్ని నిర్మించడమని అన్నారు. ఇటువంటి జాతీయ సమైక్యత శిబిరానికి తమ కళాశాల అధ్యాపకుడు ఎంపిక కావడం కళాశాలకే గర్వకారణమని, తాము కళాశాలలో ఎన్ఎస్ఎస్ విభాగాల ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నందుకుగా తమ అధ్యాపకునికి ఈ అవకాశాన్ని ఉస్మానియా విశ్వవిద్యాలయ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం కో ఆర్డినేటర్ ప్రొఫెసర్ విద్యాసాగర్ అవకాశం ఇవ్వడం చాలా సంతోషకరమని తెలిపారు. కళాశాల, అధ్యాపక బృందం తరపున తమ అధ్యాపకుడిని ఎంపిక చేసినందుకు ఉస్మానియా విశ్వవిద్యాలయ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ ప్రొఫెసర్ విద్యాసాగర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఒరిస్సాలోని బరంపూర్ లో జరిగే జాతీయ సమైక్యత శిబిరానికి తమ కళాశాల అధ్యాపకుడు ఎంపిక కావడం పట్ల అధ్యాపక బృందం, విద్యార్థిని, విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు.
జాతీయ సమైక్యత శిబిరానికి తారా కళాశాల అధ్యాపకుడు జగదీశ్వర్
Published On: March 2, 2025 3:01 pm
