ప్రశంస పత్రం అందుకున్న తారా కళాశాల అధ్యాపకుడు

సంగారెడ్డి ప్రతినిధి, జనవరి 27 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి తారా ప్రభుత్వ కళాశాలకు చెందిన జీవశాస్త్ర అధ్యాపకుడు డాక్టర్ సదయ కుమార్ ను గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ప్రశంస పత్రంతో సన్మానించడం జరిగిందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రత్న ప్రసాద్ అన్నారు. సోమవారం ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. తమ కళాశాలకు చెందిన జీవశాస్త్ర అధ్యాపకుడు డాక్టర్ సదయకుమార్ ఎన్ఎస్ఎస్ అధికారిగా, యువ టూరిజం కన్వీనర్ గా అనేక సామాజిక కార్యక్రమాలలో జిల్లా స్థాయి అధికారులతో పాల్గొనడమే కాకుండా విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించినందుకు జిల్లా స్థాయిలో ప్రశంసలు లభించడం కళాశాలకే గర్వకారణమని తెలిపారు. కళాశాల అభివృద్ధిలో భాగస్వామ్యాన్ని పంచుకుంటూ, విద్యార్థుల మన్నున్నలు పొందడం కంటే అధ్యాపకులకు మరేది గొప్ప కాదని, దానికి ప్రతిఫలంగా తమ అధ్యాపకుడికి జిల్లాస్థాయి ప్రశంసలు లభించడం చాలా సంతోషకరంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జగదీశ్వర్, ఇతర అధ్యాపక బృందం, విద్యార్థిని, విద్యార్థులు కళాశాల అధ్యాపకుడికి అభినందనలు తెలిపారు.

Join WhatsApp

Join Now