సంగారెడ్డి ప్రతినిధి, జనవరి 27 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి తారా ప్రభుత్వ కళాశాలకు చెందిన బిజినెస్ మేనేజ్మెంట్ మరియు కామర్స్ విభాగాల విద్యార్థులు క్షేత్ర పర్యటనలో భాగంగా మేడ్చల్ లోని మహాలక్ష్మి ప్రొఫైల్స్ కంపెనీని సందర్శించడం జరిగిందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రత్నప్రసాద్ తెలిపారు. సోమవారం ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. తారా కళాశాలకు చెందిన బీబీఏ మరియు బీకాం విద్యార్థులు క్షేత్ర పర్యటనలో భాగంగా మహాలక్ష్మి ప్రొఫైల్స్ కంపెనీని సందర్శించడం జరిగిందని, విద్యతో పాటు ప్రత్యక్ష అనుభవాన్ని కలిగించడం ఈ క్షేత్ర పర్యటన ప్రధాన ఉద్దేశం అని అన్నారు. ఈ కంపెనీ యొక్క హెచ్ఆర్ మేనేజర్ నాగరాజు మాట్లాడుతూ.. తారా కళాశాల విద్యార్థులకు తమ కంపెనీలో తయారయ్యే వస్తు ఉత్పత్తికి సంబంధించిన విషయాలతో పాటు, ఉత్పత్తి తయారీ విధానాన్ని ప్రత్యక్షంగా చూపించడం జరిగిందని, దీనివల్ల విద్యార్థులు పారిశ్రామిక ఉత్పత్తులకు సంబంధించి ప్రత్యక్ష అనుభవాన్ని పొందడం జరిగిందని తెలిపారు. ఇటువంటి క్షేత్ర పర్యటనలు విద్యార్థులలో జ్ఞాన సంపాదనతో పాటు నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి తోడ్పడతాయని, తారా కళాశాల విద్యార్థులు తమ కంపెనీని సందర్శించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కరుణ, అధ్యాపకులు శ్యాంసుందర్, నందిని, దీపిక, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.
తారా కళాశాల విద్యార్థుల క్షేత్ర పర్యటన
Published On: January 27, 2025 6:51 pm
