సంగారెడ్డి, అక్టోబర్ 30 (ప్రశ్న ఆయుధం న్యూస్): కేంద్ర ప్రభుత్వ యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడే ఫ్రీ రిపబ్లిక్ డే పరేడ్ క్యాంపుకు తమ కళాశాలకు చెందిన దీక్షిత బీ.ఎస్సీ. తృతీయ సంవత్సరం విద్యార్థిని ఎంపిక కావడం జరిగిందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రవీణ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడే ఫ్రీ రిపబ్లిక్ డే పరేడ్ క్యాంపు ఈ సంవత్సరం గుజరాత్ లోని పటాన్ లో అక్టోబర్ 31 నుండి నవంబర్ 9వ తేదీ వరకు జరుగుతుందని, ఈ క్యాంపుకు ఉస్మానియా విశ్వ విద్యాలయము తరపున 6 మంది విద్యార్థులు ప్రాతినిథ్యం వహిస్తున్నారని, అందులో తమ కళాశాలకు చెందిన విద్యార్థిని ఎంపిక కావడం కళాశాలకే గర్వకారణం అని తెలిపారు. ఈ ప్రీ రిపబ్లిక్ డే పరేడ్ క్యాంపు 10 రోజుల పాటు జరుగుతుందని, ఇందులో ఎంపికైన విద్యార్థులు జాతీయస్థాయిలో ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే పరేడ్ లో పాల్గొంటారని అన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా నుండి తమ కళాశాలకు చెందిన విద్యార్థిని మాత్రమే ఎంపిక కావడం జరిగిందని, ఈ ప్రీ రిపబ్లిక్ డే పరేడ్ క్యాంపులో తెలంగాణ నుండి వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన 30 మంది వాలంటీర్లు పాల్గొంటున్నారని అందులో 6 మంది వాలంటీర్లను తెలంగాణ నుండి రిపబ్లిక్ డే పరేడ్కు ఎంపిక చేస్తారని తెలిపారు. తమ కళాశాల విద్యార్థినిని ప్రతిష్టాత్మకమైన ఈ క్యాంపుకు ఎంపిక చేసినందుకు ఉస్మానియా విశ్వవిద్యాలయ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ విద్యాసాగర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ అధికారులు, అధ్యాపక బృందము పాల్గొని తమ కళాశాలకు చెందిన విద్యార్థిని ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
ఫ్రీ రిపబ్లిక్ డే పరేడ్ కు తారా కళాశాల విద్యార్థిని..
Published On: October 30, 2025 10:55 pm