టాస్క్ ఫోర్స్ దాడులు

పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి

ప్రశ్న ఆయుధం న్యూస్, జులై 24, కామారెడ్డి :

కామారెడ్డి మున్సిపాలిటీ
దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగాపూర్ గ్రామంలో బుధవారం పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ఈ ఘటనలో పట్టుబడిన వారి నుండి 1,12,800 రూపాయల నగదు, రెండు కార్లు, 4 బైక్‌లు,10 మొబైల్‌ ఫోన్ లు స్వాధీనం చేసుకున్నారు. పేకాట ఆడుతున్న తొమ్మిది మందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కామారెడ్డి జిల్లా దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి లింగాపూర్ గ్రామంలోని ఒక ఫామ్ హౌస్ లో డబ్బులు పందెంగా పెట్టి పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ తిరుపతయ్య, సిబ్బందితో కలిసి రైడ్ చేయగా 09 మంది వ్యక్తులను పట్టుకోవడం జరిగిందన్నారు. యువత ఇలాంటి ఆన్ లైన్ జూదం, క్రికెట్ బెట్టింగ్ లు ఆడుతూ అత్యాశకు పోయి జీవితాలు పాడుచేసుకోవద్దని దీనివలన ఆర్థికంగా నష్టం పోతారని అన్నారు. కేసులు నమోదయ్యితే ఉద్యోగ అవకాశాలు, ఇతర అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉందని అన్నారు. పేకాట, ఆన్ లైన్ మట్కా, జూదం, ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడే వారి సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ తిరుపతయ్య తెలిపారు.

Join WhatsApp

Join Now