*పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి*
నిజామాబాద్ ఫిబ్రవరి 06
నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మీ ప్రియ నగర్ ప్రాంతంలోని కస్తూర్బా కాలనీలో ఒక ఇంటిలో జరుగుతున్న పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం మేరకు నిజామాబాద్ ఇన్చార్జి సిపి సింధు శర్మ ఆదేశాలతో నిజామాబాద్ సి.సి.ఎస్ (ఏసిపి) ఇంచార్జ్ టాస్క్ ఫోర్స్ (ఏసిపి) టాస్క్ ఫోర్స్ సీఐ అంజయ్య ఆధ్వర్యంలో సిసిఎస్ సిబ్బంది గురువారం దాడులు నిర్వహించారు. పేకాట స్థావరం నిర్వాహకుడు తోట సత్యనారాయణ అలియాస్ సత్యంతో పాటు ఏడుగురు పేకాటరాయుళ్లు పట్టుబడ్డారు వారి వద్ద నుంచి 7 సెల్ ఫోన్లు రూ.30500 స్వాధీనం చేసుకున్నారు. వారిని రూరల్ పోలీసులకు అప్పగించారు. పేకాటనిర్వాహకుడు సత్యంపై నిజామాబాద్ నగరంలోని పలు పోలీస్ స్టేషన్ లలో పేకాట కేసులు ఉన్నట్లు తెలిసింది.