కొదురుపాక రింగ్ రోడ్డు వద్ద టాటా ఏసి బోల్తా.. తీవ్ర గాయాలు

కొదురుపాక రింగ్ రోడ్డు వద్ద టాటా ఏసి బోల్తా.. తీవ్ర గాయాలు

ఇద్దరి పరిస్థితి విషమం సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలింపు

బోయినిపల్లి(ప్రశ్న ఆయుధం జనవరి 1)

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం కొదురుపాక రింగ్ రోడ్డు వద్ద టాటా ఏసీ అదుపుతప్పి బోల్తా పడడంతో అందులో ఉన్న వలస కూలీలకు తీవ్రగాయాలు కావడం జరిగింది వలస కూలీలు బీహార్ నుండి బతుకుదెరువు కోసం వరి నాట్లు వేయడానికి వచ్చి అలుగునూర్ లో నివాసముంటున్నారు వరి నాట్ల పని ముగించుకొని బుధవారం రోజు ఉదయం ఆలుగునూరు నుండి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనానికి వెళ్తున్న సమయంలో కొదురుపాక చౌరస్తా వద్ద స్పీడుగా ఉండటం తో టాటా ఏసీ అదుపుతప్పి బోల్తాపడడం జరిగింది అందులో 18 మంది మహిళలు 9 మంది పురుషులు ప్రయాణిస్తున్నారు అందులో కొంతమంది తీవ్రంగా గాయపడ్డారని క్షతగాత్రులను ఏరియా ఆసుపత్రికి తరలించారు ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు స్థానికులు అంటున్నారు. కుదురుపాకలో ఇలాంటి ప్రమాదాలు చాలా జరుగుతున్నాయి కాబట్టి దీనిపై అధికారులు చర్య తీసుకుని ప్రమాదాలు జరగకుండా స్పీడ్ బ్రేకర్లు గాని ఎచ్చరిక గుర్తులు గాని పెట్టి ప్రమాదాలను నివారించేలా చూడాలని ప్రజలు మాట్లాడుకుంటున్నారు.

Join WhatsApp

Join Now