టాటా ఏస్ ఢీకొని మహిళా మృతి.

టాటా ఏస్ ఢీకొని మహిళా మృత..

నిజామాబాద్ (ప్రశ్న ఆయుధం ) జిల్లా ప్రతినిధిడిసెంబర్: 26
నగరంలోని నెహ్రూ పార్క్ వద్ద బుధవారం టాటా ఏస్ ఢీకొన్న ఘటనలో మహిళ మృతి చెందింది. పోలీసుల కథనం ప్రకారం సారంగపూర్ గ్రామానికి చెందిన పల్లె సవిత (52)బీడీలు చుట్టుకుంటూ జీవనం సాగిస్తుంది. పని నిమిత్తం ఆమె బుధవారం నగరానికి వచ్చింది. నగరంలోని నెహ్రూ పార్క్ వద్ద రోడ్డు దాటుతుండగా టీఎస్ టీ 7327 నంబరు గల టాటా ఏస్ డ్రైవర్ అతివేగంగా వచ్చి ఆమెను ఢీకొట్టాడు. ఈ ఘటనలో పల్లె సవితకు తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే ఆమెను నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. మృతురాలి భర్త నర్సాగౌడ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Join WhatsApp

Join Now