కాకినాడ రోడ్ లో గల ఎన్టీఆర్ విగ్రహం వద్ద ప్రతి సోమవారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్ పర్యవేక్షణలో దాత సహకారంతో ఉచిత అన్నా క్యాంటీన్ నిర్వహిస్తున్నారు. ఈ సోమవారం జగ్గంపేట నియోజకవర్గం బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు వేములకొండ జోగారావు కుమారుడు చైతన్య ఆర్థిక సహాయంతో అన్నా క్యాంటీన్ లో పేదలకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర టీడీపీ కార్యదర్శి ఎస్ఎస్ అప్పలరాజు మాట్లాడుతూ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆదేశాలతో ప్రతి సోమవారం దాతల సహకారంతో ఉచిత అన్న క్యాంటీన్ నిర్వహిస్తున్నామని ఈ వారం జోగారావు గారి కుమారుడు చైతన్య ఆర్థిక సహాయంతో ఈ కార్యక్రమం చేపట్టామని పేదల ఆకలి తీర్చేందుకు తెలుగుదేశం పార్టీ ఆగస్టు 15 నుండి అన్నా క్యాంటీన్లు నిర్వహించి ఐదు రూపాయలకే పేదల ఆకలి తీరుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మారిశెట్టి భద్రం, కొత్త కొండబాబు, దాపర్తి సీతారామయ్య, రాయి సాయి,యురామారావు, కెవిఎస్ మూర్తి, బి పార్థసారథి, జీవి సుబ్రమణ్యం, డేగల సత్తిబాబు, బద్ది సురేష్, మారిశెట్టి రాధా, ఎస్ వి ప్రసాద్, కొత్త నాగ పండు, నాగిరెడ్డి అనిల్, తుమ్మల కిషోర్, ప్రేమ స్వరూప్ బుజ్జి, ముక్కాపాలు బాబు, వానశెట్టి శ్రీను తదితరులు పాల్గొన్నారు..
పేదల ఆకలి తీర్చేందుకే టిడిపి అన్న క్యాంటీన్లు ఏర్పాటు.
by admin admin
Published On: August 12, 2024 11:57 pm