లింగంపేట్ లో ఆధార్ కేంద్రం కోసం టీడీపీ వినతి..
లింగంపేట తహసీల్దార్ కు ఆధార్ కేంద్రం ఏర్పాటు పట్ల టీడీపీ వినతి పత్రం సమర్పణ
పార్టీ మండల అధ్యక్షుడు భీంరావు, ఉపాధ్యక్షుడు విశ్వేశ్వర్ శర్మ
లింగంపేట్ మండల కేంద్రంలో ఆధార్ సదుపాయం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపణ
కామారెడ్డి,లింగంపేట్, జూలై 30:
లింగంపేట్ మండల కేంద్రంలో ఆధార్ సేవల కల్పన కోసం టీడీపీ పార్టీ తరఫున స్థానికతహసీల్దార్ కి వినతి పత్రం సమర్పించారు. మండల టీడీపీ అధ్యక్షుడు భీంరావు, ఉపాధ్యక్షుడు విశ్వేశ్వర్ శర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఐలాపూర్ గ్రామానికి చెందిన కమ్మరి కృష్ణ, రాంపల్లి నాణ్యానాయక్, సూరాయిపల్లి బంగ్ల సాయిలు పాల్గొన్నారు. అలాగే బండారి వెంకట్ రెడ్డి, డి. అంజయ్య, తిరుమల కిషన్, బోనాల్ జెగ్యానాయక్ తదితర పార్టీ కార్యకర్తలు కూడా ఈ వినతి కార్యక్రమానికి మద్దతుగా హాజరయ్యారు.
ప్రజలకు ఆధార్ సంబంధిత సేవల కోసం చాలా దూరం ప్రయాణించాల్సి వస్తోందని, మండల కేంద్రంలో ఆధార్ కేంద్రం ఏర్పాటు చేయాలన్నదే తమ డిమాండ్ అని వారు తెలిపారు.