Headlines
-
“తెలుగుదేశం పార్టీ సభ్యత్వ స్పెషల్ డ్రైవ్: పాలకుర్తిలో భారీ స్పందన”
-
“సభ్యులకు 5 లక్షల ప్రమాద బీమా: టీడీపీ అధ్యక్షుడు వివరాలు”
-
“తెలంగాణలో టీడీపీ పునర్ వైభవం కోసం ప్రత్యేక కార్యక్రమాలు”
-
“నారా చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి: టీడీపీ సభ్యత్వ కార్యక్రమం”
-
“పాలకుర్తిలో పార్టీ కార్యకర్తల చురుకైన పాల్గొనటం”
పాలకుర్తి నవంబర్ 24.
తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు స్పెషల్ డ్రైవ్ పాలకుర్తి మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలను మండల పార్టీ అధ్యక్షుడు గజ్జెల్లి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు 5 లక్షల ప్రమాద బీమా వర్తిస్తున్నట్లు తెలిపారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి చెందినట్లు ఆయన తెలిపారు. రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్రంలో పార్టీని పునర్ వైభవం తీసుకురావడం కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి గుగులోతు రమేష్, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.