టీచర్ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి కొమురయ్య విజయంతో సంబరాలు

మెదక్/నర్సాపూర్, మార్చి 4 (ప్రశ్న ఆయుధం న్యూస్): తెలంగాణ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కొమురయ్య ఘన విజయం సాధించడంతో నర్సాపూర్ బీజేపీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. మంగళవారం నర్సాపూర్ బస్టాండ్ వద్ద బాణసంచా కాల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ.. కొమురయ్య గెలుపు పార్టీకి కొత్త ఉత్సాహాన్ని తీసుకువచ్చిందని, రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ పట్ల ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందని తెలిపారు. తెలంగాణలో బీజేపీ బలపడే దిశగా ఈ విజయం కీలకమైనదని వారు అభిప్రాయపడ్డారు. బీజేపీ శ్రేణులు ఈ విజయం తమ పార్టీ బలోపేతానికి మద్దతుగా నిలిచిందని, రాష్ట్రంలో బీజేపీ మరింత శక్తివంతంగా ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ రాష్ట్ర నాయకులు పెద్ద రమేష్ గౌడ్, రాష్ట్ర బీజేపీ ఓబీసీ ఉపాధ్యక్షుడు పాపగారి రమేష్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేందర్, అసెంబ్లీ కన్వీనర్ రమణారావు, మండల అధ్యక్షుడు నీలి నాగేష్, నీరుడు చంద్రయ్య, జిల్లా నాయకులు రామ్ రెడ్డి, బాదే బాలరాజ్, సంగసాని రాజు, రాములు నాయక్, ఓంకార్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now