ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డికి మద్దతు
–దివ్యాంగ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జంగం శ్రీశైలం
ప్రశ్న ఆయుధం న్యూస్, ఫిబ్రవరి 11, కామారెడ్డి :
నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ ఎమ్మెల్సీ అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డికి సంపూర్ణ మద్దతు ప్రకటించినట్లు దివ్యాంగ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జంగం శ్రీశైలం తెలిపారు. తమ సంఘం తరఫున మద్దతు లేఖను కరీంనగర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి, పీఆర్టీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుల్గం దామోదర్ రెడ్డి సమక్షంలో అందజేశారు. ఈ సందర్భంగా దివ్యాంగ ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చినందున వంగ మహేందర్ రెడ్డి గెలుపునకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.