ఉపాధ్యాయ ఎమ్మెల్సీ విజయం చారిత్రాత్మక ఘట్టం
ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా మల్కా కొమురయ్య ఘన విజయం
ప్రశ్న ఆయుధం 04 మార్చి ( బాన్సువాడ ప్రతినిధి )
ఉమ్మడి కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గా చారిత్రాత్మక విజయాన్ని సాధించిన మన అభ్యర్థి శ్రీ మల్క కొమురయ్య విజయం సాధించిన సందర్భంగా బాన్సువాడ మండలం దేశాపేట్ లోనీ ఎస్ఆర్ఎన్ కే డిగ్రీ కళాశాలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కోన బాన్సువాడ లో ఉపాధ్యాయులకు వందనం”కార్యక్రమం చేయటం జరిగింది.ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ..నిజామాబాద్ అదిలాబాద్ మెదక్ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమురయ్య భారీ మెజార్టీతో మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించిన ఉపాధ్యాయులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తూ బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ పాఠశాల కళాశాలల ఉపాధ్యాయులకు లెక్చర్లకు ధన్యవాదాలు తెలియజేస్తూ మిఠాయిలు పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి అసెంబ్లీ పట్టభద్రుల ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి బిజెపి జిల్లా కార్యదర్శి శంకర్ గౌడ్ బిజెపి రూరల్ అధ్యక్షులు మజ్జిగ శ్రీనివాస్ బీజేపీ నాయకులు కోణాల గంగారెడ్డి హన్మాండ్లు చీకట్ల రాజు శివశంకర్ శంకర్ డిజె సాయి సాయి రెడ్డి దత్తు సాయి ప్రసాద్ శివకుమార్ లక్ష్మణ్ రామకృష్ణ సంతోష్ అంజయ్య విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.