Site icon PRASHNA AYUDHAM

సొంత నిధులతో బోరు వేయించిన టీచర్ ప్రవీణ్ కుమార్

WhatsApp Image 2025 02 09 at 3.02.38 PM

గజ్వేల్ ప్రభుత్వ పాఠశాలకు సొంత నిధులతో బోరు వేయించిన టీచర్ ప్రవీణ్ కుమార్

సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణం బాలుర విద్యా సౌధంలోని ప్రభుత్వ పాఠశాలలో త్రాగునీటి సమస్య తలెత్తింది. మిషన్ భగీరథ ద్వారా వస్తున్న అరకొరగా వస్తున్న పాఠశాలలో సంపు లో నిలువ చేసిన నీటిని పాఠశాల అవసరాలకు వినియోగిస్తున్నారు. సంపులో నిల్వ ఉన్న నీరు పైకప్పు లేకపోవడంతో నీరు కలుషితమైంది. మంచినీటి సమస్యను గుర్తించిన పాఠశాలలో డ్రాయింగ్ మాస్టర్ గా విధులు నిర్వహిస్తున్న పాలమాకుల ప్రవీణ్ కుమార్ తన స్వంత ఖర్చులతో బోరు వేసి మోటార్ బిగించి పూజా కార్యక్రమాలు నిర్వహించి మంచినీటి సౌకర్యాన్ని వాడుకలోకి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి హాజరై మంచినీటి సుజల స్రవంతి తన చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఎంతోమంది చెప్పే వాళ్ళు ఉంటారు కానీ పాలమాకుల ప్రవీణ్ కుమార్ చేతలతో తన యొక్క సేవా గుణాన్ని చాటుకున్నారని అభినందించారు. అదేవిధంగా మండల విద్యాధికారి కృష్ణ మాట్లాడుతూ నిస్వార్థ సేవకు ప్రవీణ్ కుమార్ ప్రతీక అని కొనియాడారు ఈ కార్యక్రమంలో అధ్యాపక బృందం,విద్యార్థులు, బోధనేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version