పిఆర్టియు తోనే ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం
ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి
జగదేవపూర్ ఆగస్టు 22 ప్రశ్న ఆయుధం :
జగదేవపూర్ మండలంలో మండల అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శులు చిలుకూరి వెంకట్రాంరెడ్డి,రాత్లావత్ బొద్దు ఆధ్వర్యంలో నిర్వహించిన పిఆర్టియు సభ్యత్వ సేకరణలో పాల్గొన్న శాసనమండలి సభ్యులు కూర రఘోత్తం రెడ్డి మాట్లాడుతూ గత 54 సంవత్సరాలుగా ఉపాధ్యాయుల జీవన ప్రమాణాల మెరుగుదలకు ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కోసం కృషి చేస్తున్న ఏకైక సంఘం పి ఆర్ టి యు సంఘం మాత్రమేనని అన్ని క్యాడర్ల ఉపాధ్యాయుల సమస్యలన్నీ పి ఆర్ టి యు తోనే పరిష్కారమవుతాయని ఎమ్మెల్సీ రఘోత్తం రెడ్డి అన్నారు. జగదేవపూర్ మండలంలో వివిధ పాఠశాలల్లో ప్రభుత్వ ఉన్నత పాఠశాల, మోడల్ స్కూల్,కేజీబీవీ, బాలికల పాఠశాల మొదలగు పాఠశాలలో సభ్యత్వ సేకరణలో ఎమ్మెల్సీ పాల్గొన్న సందర్భంగా వివిధ ఉపాధ్యాయ సమస్యలు ప్రస్తావిస్తూ త్వరలోనే ఉపాధ్యాయులకు మూడు డి ఏ లు ఇవ్వడానికి ముఖ్యమంత్రి అంగీకరించారని, మెరుగైన పిఆర్సి కోసం పిఆర్టియు సంఘం ప్రాతినిథ్యం చేసిందని,
ప్రాథమిక పాఠశాలల్లో 5600 ప్రధానోపాధ్యాయుల పోస్టులు కొత్తవి మంజూరు చేసి పదివేల పోస్టులకు మొత్తం పెంచి జీవోలు 11, 12 లను సవరింప జేయించి బి ఈ డి అర్హత కలిగిన వారు కూడా పిఎస్ హెచ్ఎంలుగా పదోన్నతులు పొందుటకు ప్రభుత్వాన్ని ఒప్పించి ఇప్పిస్తామని ఎమ్మెల్సీ తెలిపారు. అదేవిధంగా మోడల్ స్కూల్ బదిలీలకు వారం పది రోజుల్లో షెడ్యూల్ విడుదలవుతుందని, ఉద్యోగుల వేతనాలు 010 పద్దు కింద ఇవ్వాల్సిందిగా ప్రభుత్వానికి ప్రాతినిథ్యం చేశామని ప్రభుత్వ విద్యా రంగంలో మోడల్ పాఠశాలలను మెర్జ్ చేయాలని, మోడల్ స్కూల్, గురుకులాలు, ప్రభుత్వ ఉపాధ్యాయులు అందరికీ త్వరలోనే హెల్త్ కార్డులు మంజూరు అవుతాయని ఎమ్మెల్సీ తెలిపారు. కేజీబీవీ పాఠశాలల్లో ఉన్న సమస్యలన్నిటిపై ముఖ్యమంత్రి కి ప్రాతినిధ్యం చేశామని, సెలవుల విషయం మరికొన్ని నిబంధనలు సవరింప చేస్తామని త్వరలోనే కె జి వి బి ఉపాధ్యాయులు అందరికీ మినిమం టైమ్స్ స్కేల్ వర్తించేట్లు కృషి చేస్తున్నామని ఎమ్మెల్సీ తెలిపారు. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింప చేయడానికి కార్యాచరణ ఏర్పాటు చేశామని పాఠశాలల పటిష్టత కోసం ప్రభుత్వ విద్యా రంగంలో చదువుకునే పిల్లల భవిష్యత్తు కోసం ఉపాధ్యాయులంతా కృషి చేయాలని ఎమ్మెల్సీ రఘోత్తం రెడ్డి ఉపాధ్యాయులను కోరారు. ఈ సభ్యత్వ సేకరణలో ఎమ్మెల్సీ తో పాటు పిఆర్టియు సిద్దిపేట జిల్లా అధ్యక్షులు ఎ. శశిధర్ శర్మ, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు పి. రామకృష్ణారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ. శ్రీనివాస్ రాష్ట్ర కార్యదర్శి కె.ప్రభాకర్, మండల కార్యవర్గ సభ్యులు మోతిరామ్, నగేష్, నరేందర్ రెడ్డి,రవీందర్ నాయక్, భగవాన్ రెడ్డి, నాగార్జున్ సాగర్,రిటైర్డ్ ఉపాధ్యాయులు జ్యోతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.