సంగారెడ్డి ప్రతినిధి, మార్చి 23 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా,సదాశివపేట మండలం నిజాంపూర్(కే) ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పోట్రు.రామకృష్ణకు విద్యా సామాజిక సేవలకు గాను ఇంటర్నేషనల్ పీస్ యూనివర్సిటీ జర్మనీ వారు గౌరవ డాక్టరేట్ ను ప్రధానం చేశారు. ఆదివారం తమిళనాడు లోని పాండిచ్చేరిలో షెన్ బగ హోటల్ అండ్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన ఒక కార్యక్రమంలో యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ పీస్ కౌన్సిల్ చీఫ్ డైరెక్టర్ డా.ప్రభు రాజేంద్రన్, రిజిస్టార్ డా.గోపి కన్నన్, ప్రెసిడెంట్ వైభవ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ మైసూర్ డాక్టర్ అంబికా నజరేత్ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛాన్సలర్ సాంస్క్రిట్ ఏన్షియంట్ యోగ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ చెల్లదురై, చైర్మన్ ఆఫ్ సివోనా హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ కోయంబత్తూర్ డాక్టర్ లక్ష్మికాంతన్, నేషనల్ ప్రెసిడెంట్ నేషనల్ రైట్స్ ఆర్గనైజేషన్ డాక్టర్ ఖదీర్వెల్, డా.కిమ్, సురేష్ బాబు, దేవేంద్రన్,కర్ణాటక ఫిల్మ్ డైరెక్టర్ అశ్వత్, వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. రామకృష్ణకు ఇది రెండవ గౌరవ డాక్టరేట్. 2022లో ద సౌత్ వెస్ట్రన్ అమెరికన్ యూనివర్సిటీ ద్వారా డాక్టరేట్ పొందారు. డాక్టరేట్ పొందిన రామకృష్ణకు మండల విద్యాధికారి శంకర్, నోడల్ అధికారి సుధాకర్, నిజాంపూర్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు రాజశ్రీ, వివిధ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు,గ్రామస్తులు, స్నేహితులు, విద్యార్థులు అభినందనలు తెలిపారు.
Latest News
