సంగారెడ్డి ప్రతినిధి, మార్చి 26 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా నిజాంపూర్ (కె) ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పోట్రు.రామకృష్ణ డాక్టరేట్ స్వీకరించిన సందర్భంగా పాఠశాల అమ్మ ఆదర్శ చైర్మన్ ఎర్ర.మీనా ఆధ్వర్యంలో ఉపాద్యాయులు, విద్యార్థులు పూలమాల, శాలువాలతో ఘనంగా సన్మానించారు. విద్యార్థులు రామకృష్ణకు స్వీటు తినిపించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ మీనా మాట్లాడుతూ.. రామకృష్ణకు డాక్టరేట్, అవార్డులు రావడం మా గ్రామానికి గర్వ కారణం అన్నారు. అనంతరం ఉపాధ్యాయులు నవనీత, సునీత మాట్లాడుతూ.. అందరూ ఉపాధ్యాయులు సమిష్టిగా కలిసి పని చేసినప్పుడు ఫలితాలు బాగా ఉంటాయన్నారు. కాగా రామకృష్ణ మాట్లాడుతూ.. గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు సహకారం ఉంటే ఆ గ్రామంలోని పాఠశాల ఎంతో అభివృద్ధి చెందుతుందని అన్నారు. రామకృష్ణ గ్రామస్తులకు తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ మీనా, ఉపాధ్యాయులు నవనీత, సునీత, విద్యార్థులు పాల్గొన్నారు.