టీచర్ ఇన్స్పిరేషన్ పురస్కారం అందుకున్న ఉపాధ్యాయుడు రామకృష్ణ

సంగారెడ్డి ప్రతినిధి, నవంబరు 17 (ప్రశ్న ఆయుధం న్యూస్): హైదరాబాద్ బి.ఎం.బిర్లా సెన్స్ సెంటర్ లోని భాస్కరా అడిటోరియంలో శారద ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి టీచర్స్ ఇన్స్పిరేషన్ అవార్డ్స్ 2024 పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమం ఆదివారం శారద ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ పట్నం.కమల మనోహర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం పరిధిలోని నిజంపూర్ (కె) పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పోట్రు.రామకృష్ణ రాష్ట్ర స్థాయి టీచర్ ఇన్స్పిరేషన్ పురస్కారంను ముఖ్య అతిథి శాతవాహన యూనివర్సిటీ వైస్ చైర్మన్ ఉమేష్ కుమార్, రోబోటిక్ సీ.ఈ.ఓ మనీష్ జిందాల్ చేతుల మీదుగా అందుకున్నారు. పాఠశాల నిర్వహణ, విన్నూత్న బోధన మరియు సామాజిక సేవలకుగాను ఈ పురస్కారం రామకృష్ణ కు ప్రధానం చేసినట్లు నిర్వహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో శాతవాహన యూనివర్సిటీ వైస్ చైర్మన్ ఉమేష్ కుమార్, వ్యాపారవేత్త మునిష్ జిందాల్, డా.సాహిత్యవల్లి, నక్క శ్రీనివాస్, పట్నం సుజాత, తోట.ప్రవీణ నాయుడు, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now