ఉపాధ్యాయుడిగా మారిన జిల్లా కలెక్టర్
భిక్నూర్ జెడ్‌పీహెచ్‌ఎస్ పాఠశాలలో విద్యార్థులకు సోలార్ సిస్టమ్‌పై బోధన
కామారెడ్డి జిల్లా ప్రతినిధి (ప్రశ్న ఆయుధం)అక్టోబర్ 17
భిక్నూర్ మండలంలోని జెడ్‌పీ బాలుర ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాల పరిస్థితిని సమీక్షించిన అనంతరం స్వయంగా 10వ తరగతి విద్యార్థులకు సోలార్ సిస్టమ్ పై పాఠం బోధించారు. విద్యార్థుల సందేహాలు నివృత్తి చేసి, వారిలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, “విద్య పాఠశాలల నుంచే మార్పు మొదలవుతుంది” అన్నారు. ఐఎస్ఆర్ఓ సందర్శనకు ఎంపికైన ఇద్దరు విద్యార్థినులను అభినందించి నోట్‌బుక్స్ అందజేశారు. కార్యక్రమంలో అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.