గజ్వేల్ మహతి హైస్కూల్‌లో టీచర్ దౌర్జన్యం…!!
6వ తరగతి విద్యార్థిని చితకబాదిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి.!
మహతి హైస్కూల్‌లో ఉపాధ్యాయుడు ఆంజనేయుల దౌర్జన్యం..!!
6వ తరగతి విద్యార్థిని మీద విచక్షణ రహితంగా దాడి..!
యాజమాన్యం “తప్పించాం” అంటూ తప్పించుకునే ప్రయత్నం..!
స్థానికులు: కేవలం తొలగింపే కాదు, కేసు తప్పనిసరి..!
చిన్నారులపై శారీరక శిక్షలు చట్ట విరుద్ధం – నిపుణుల హెచ్చరిక..!
ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 20
గజ్వేల్ పట్టణంలో చోటుచేసుకున్న ఒక సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చి తీవ్ర కలకలం రేపింది. స్థానిక మహతి హైస్కూల్‌లో ఉపాధ్యాయుడు ఆంజనేయులు, 6వ తరగతి విద్యార్థిని పై విచక్షణ రహితంగా దాడి చేసి తీవ్రంగా కొట్టినట్లు సమాచారం. చదువు చెప్పాల్సిన గురువు, విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దాల్సిన బాధ్యత వహించాల్సిన వ్యక్తే ఇలా చేయి చేసుకోవడం తల్లిదండ్రుల్లో ఆగ్రహాన్ని రేపింది.
ఘటన బయటపడగానే స్కూల్ యాజమాన్యం తొందరగా స్పందించి – “సంబంధిత ఉపాధ్యాయుడిని విధుల నుంచి తప్పించాం” అంటూ ప్రకటన విడుదల చేసింది. అయితే ఆ ప్రకటనతో సమస్య తీరదని తల్లిదండ్రులు, స్థానికులు స్పష్టం చేస్తున్నారు. “కేవలం తొలగింపే సరిపోదు… ఈ ఘటనపై వెంటనే కేసు నమోదు చేయాలి. చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే నిరసనలు భగ్గుమంటాయి” అంటూ తీవ్రంగా హెచ్చరించారు.
చట్టపరమైన కోణం…!!
🔹 చిన్నారులపై శారీరక శిక్షలు పూర్తిగా నిషేధం. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ – 2009 ప్రకారం, ఎటువంటి పరిస్థితుల్లోనూ విద్యార్థులపై శారీరక శిక్షలు అనుమతించబడవు.
🔹 ఇలాంటి చర్యలకు IPC 323 (కాయానికి హాని చేయడం), 324 (శారీరక హింస), 506 (భయపెట్టడం) వంటి సెక్షన్లు వర్తించే అవకాశం ఉంది.
🔹 అలాగే జువెనైల్ జస్టిస్ యాక్ట్ – 2015 ప్రకారం, చిన్నారులపై దౌర్జన్యం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
స్థానికుల ఆగ్రహం..!!
ఈ ఘటనతో గజ్వేల్ ప్రాంతంలో ఆగ్రహం ఉద్ధృతమైంది. తల్లిదండ్రులు, స్థానిక సంఘాలు బహిరంగంగా స్పందిస్తూ – “విద్యార్థులపై చేయి చేసుకునే ఉపాధ్యాయులకు పాఠం చెప్పాలి. కేవలం స్కూల్ నుంచి పంపేయడం సరిపోదు. చట్టపరంగా కేసు పెట్టకపోతే ఇకనైనా ప్రజలు స్వయంగా ఉద్యమిస్తారు” అని హెచ్చరించారు.
ఆందోళన కలిగిస్తున్న వాస్తవం..!!
చిన్నారులపై శారీరక శిక్షలు నిషేధం అయినా, ఇలాంటి ఘటనలు తరచూ బయటపడటం ఆందోళన కలిగిస్తోంది. పాఠశాలలు భద్రతా కట్టడీలను బలోపేతం చేయాలని, తల్లిదండ్రులకు పూర్తి నమ్మకం కలిగించే విధంగా వ్యవహరించాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు.