సంగారెడ్డి, డిసెంబర్ 31 (ప్రశ్న ఆయుధం న్యూస్): ఉపాధ్యాయులు నేటి సమాజానికి నిర్మాతలుగా మారారని అడిషనల్ కలెక్టర్ మాధురి అన్నారు. బుధవారం టీటీయూ సంగారెడ్డి జిల్లా శాఖ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఉపాధ్యాయులపై సమాజ నిర్మాణం పట్ల పూర్తి బాధ్యత ఉందని, ఉపాధ్యాయులు కూడా నిస్వార్ధంగా సేవ చేయాలని కోరారు. అనంతరం జేఏసీ సెక్రటరీ జనరల్ వైద్యనాథ్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ టీచర్స్ యూనియన్ టీటీయూ నిరంతరం పని చేస్తుందని కొనియడారు. అనంతరం టీటీయూ జిల్లా క్యాలెండర్ ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో టీటీయూ రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షుడు ఎం. మోహన్, జిల్లా అధ్యక్షుడు పి. ప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టి రవికుమార్, కంది మండల అధ్యక్షుడు తుల్జారాం, సదాశివపేట మండల అధ్యక్షుడు జగన్మోహన్, మండల ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్, కృష్ణ, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయులు సమాజ నిర్మాతలు: అడిషనల్ కలెక్టర్ మాధురి
Oplus_16908288