రాష్ట్ర స్థాయి పోటీలో పాల్గొనడానికి వెళ్తున్న విద్యార్థిని అభినందించిన ఉపాధ్యాయులు
– కామారెడ్డి
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రికెట్ రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనడానికి వెళ్తున్న విద్యార్థులని ఉపాధ్యాయ బృందం గురువారం అభినందించారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయుడు రవీంద్ర రెడ్డి మాట్లాడుతూ తిమ్మయ్య గారి సుశీల నారాయణరెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బీబీపేట కు చెందిన 10వ తరగతి విద్యార్థిని తుమ్మ రవీందర్ రవీందర్ కూతురు తుమ్మ అక్షయ అండర్19 బాలికల స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రికెట్ రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనడానికి రేపు శుక్రవారం సికింద్రాబాద్ లోని సైనిక్పురి కి వెళ్ళుచున్నందున పాఠశాల పిడి ఆంజనేయులు, విశ్వమోహన్, ఉపాధ్యాయ బృందం అమ్మాయిని అభినందించడం జరిగిందని ఆయన తెలిపారు..