వీఎన్నార్ పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
నిజామాబాద్, సెప్టెంబర్ 5 (ప్రశ్న ఆయుధం):
జేసీఐ అలుమ్ని క్లబ్, విశ్వతేజస్ సంస్థల ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం నగరంలోని వీఎన్నార్ పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన 14 మంది ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.
ముఖ్య అతిథిగా పాల్గొన్న జేసీఐ అలుమ్ని జోన్ వైస్ చైర్మన్ విజయానంద్ మాట్లాడుతూ, “ఉపాధ్యాయ వృత్తి అత్యంత పవిత్రమైనది. విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దే గురువులు సమాజానికి మార్గదర్శకులు” అని అన్నారు.
కార్యక్రమంలో విశ్వతేజస్ అధ్యక్షుడు తిరునగరి శ్రీహరి, టీచర్స్ డే ప్రాజెక్ట్ చైర్మన్ లావణ్య, జేసీఐ జోన్ ఆఫీసర్ జిల్కర్ నయన్, పూర్వాధ్యక్షులు యాదేష్, గంగాదాస్, మహిళా విభాగం పూర్వాధ్యక్షురాలు ప్రసన్న, వీణ, జేసీఐ సభ్యుడు యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.