నాగరంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం
మేడ్చల్ జిల్లా నాగారం ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 08
నాగారం ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని సోమవారం నాడు ఘనంగా నిర్వహించారు. సెప్టెంబర్ 5న సెలవు దినం కావడంతో, ఈ కార్యక్రమాన్ని ఈ నెల 8న నిర్వహించారు. ఈ వేడుకలకు మాజీ మున్సిపల్ ఛైర్మన్ చంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రధానోపాధ్యాయులు రాములు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
అతిథులు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అడ్వకేట్ శ్రీనివాస్ మరియు గణేష్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల పట్ల కృతజ్ఞతగా ‘చాలెంజ్ ట్రోఫీ’ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఈ సంవత్సరం మండలంలోనే మొదటి స్థానంలో నిలిచిన పాఠశాలకు ఈ ట్రోఫీని బహుకరించారు.
ముఖ్య అతిథి చంద్రారెడ్డి మాట్లాడుతూ, విద్య విలువ మరియు ఉపాధ్యాయుల గౌరవం గురించి వివరించారు. కీసర సీఐ ఆంజనేయులు మాట్లాడుతూ, విద్యార్థులు డ్రగ్స్ మరియు ఫోన్ అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. అలాగే, 6 నెలల్లో విద్యార్థులకు షూస్ అందజేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, వాలంటీర్లు మరియు గ్రామస్తులు పాల్గొని వేడుకను విజయవంతం చేశారు.