*మండల విద్యాధికారి ని సన్మానించిన ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు*
*జమ్మికుంట ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 27*
నూతన జమ్మికుంట మండల విద్యాధికారిగా బాధ్యతలు స్వీకరించిన మంతెల హేమలతను మండలంలోని ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు ఉపాధ్యాయులు మాట్లాడుతూ పాఠశాలల అభివృద్ధిలో ఉపాధ్యాయుల సమస్యల పట్ల సానుకూల దృక్పథంతో ఉండాలని కోరారు మండల విద్యాధికారి హేమలత మాట్లాడుతూ ఏసమస్య ఉన్న నా దృష్టికి తీసుకరావచ్చని ప్రతి పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచుతూ మన మండలం జిల్లాలో ఆదర్శంగా ఉండాలని కోరారు.ఈ కార్యక్రమంలో గుడిమిల్ల బలరాం దెబ్బేట రవీందర్ ఏం నాగరాజు డి నాగరాజు ఎండి రజాక్ వేణుగోపాల్ రాజి రెడ్డి ఏ.శ్రీనివాస్ విజయ్ మహిళా ఉపాధ్యాయులు జ్యోతి శ్యామల అనిత రాణి సునీత తదితరులు పాల్గొన్నారు