రామారెడ్డి మండలంలో ఉపాధ్యాయుల ఘన సన్మానం

రామారెడ్డి మండలంలో ఉపాధ్యాయుల ఘన సన్మానం

డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్బంగా ఉపాధ్యాయ దినోత్సవం వేడుకలు.

ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై సన్మానితులైన గురువులు.

మండల విద్యాధికారి ఆనంద్ రావు చేతులమీదుగా ఘన సత్కారం.

విద్యా నాణ్యత పెంపుతో దేశానికి గర్వకారణమైన విద్యార్థులను తీర్చిదిద్దాలనే పిలుపు.

కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సమూహంగా పాల్గొని విజయవంతం చేసిన వేడుక.

రామారెడ్డి, సెప్టెంబర్ 9 (ప్రశ్న ఆయుధం):

డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా రామారెడ్డి మండలంలోని వివిధ పాఠశాలలకు చెందిన ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసి ఘనంగా సన్మానించారు. మండల విద్యాధికారి ఆనంద్ రావు స్వయంగా ఉపాధ్యాయులకు శాలువా కప్పి సత్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉపాధ్యాయుల కృషి ద్వారానే విద్యార్థులు సమాజంలో ఆదర్శవంతులుగా తయారవుతారని పేర్కొన్నారు. రెట్టింపు ఉత్సాహంతో పని చేసి దేశం గర్వపడేలా విద్యార్థులను తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు.

కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ప్రశాంత్, తదితరులు సమూహంగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Join WhatsApp

Join Now