ఉపాధ్యాయ ఉద్యమ నాయకులు కామ్రేడ్ రమణ అన్నకు జోహార్లు
— టి పి టి ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చకినాల అనిల్ కుమార్
ప్రశ్న ఆయుధం – కామారెడ్డి
టి పి టి ఎఫ్ రాష్ట్ర పూర్వ అధ్యక్షులు కామ్రేడ్ కే రమణ అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. ఆయన మృతి చెందడం చాలా బాధాకరమైన విషయమని టిపిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు సకినాల అనిల్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఉపాధ్యాయునిగా ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ఒకవైపు శ్రమిస్తూనే, సమసమాజ స్థాపన కోసం, శ్రామిక వర్గాల అభివృద్ధి కోసం నిరంతరంఉద్యమ మార్గంలో పయనించిన రమణ కు టి పి టి ఎఫ్ రాష్ట్ర కమిటీ నివాళులర్పిస్తున్నదన్నారు. ఐక్యఉపాధ్యాయ నిర్మాణానికి ఆయన కృషి ఆదర్శనీయం.
ఉపాధ్యాయునిగా రమణ అన్న మొదటి నుండి ఫెడరేషన్లో కార్యకర్తగా, నాయకునిగా ,ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నో ఉద్యమాలకు నాయకత్వం వహించి విద్యార్థుల పక్షాన ఉపాధ్యాయుల పక్షాన నిలబడి పోరాడిన నాయకుడిని ఫెడరేషన్ కోల్పోవడం తీరని లోటనీ పేర్కొన్నారు. రమణ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ రమణ అకాల మరణం పట్ల సంతాపాన్ని ప్రకటిస్తున్నాం అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.