ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి
ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ కరపత్రం విడుదల
ఆగస్టు 1న కలెక్టరేట్ ఎదుట ధర్నా
జమ్మికుంట జులై 29 ప్రశ్న ఆయుధం
విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కరం కోసం ఆగస్టు 1న కలెక్టరేట్ వద్ద నిర్వహించే ధర్నాను జయప్రదం చేయాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూ.ఎస్. పీ.సీ) నాయకులు కోరారు. జమ్మికుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలురు ఆవరణంలో ధర్నాకు సంబంధించిన కరపత్రాలను ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ జిల్లా, మండల నాయకులు, కార్యకర్తలు విడుదల చేశారు. ఈ సందర్భంగా యూఎస్బీసీ నాయకులు మాట్లాడుతూ ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ యూఎస్పీసీ ఆధ్వర్యంలో ఆగస్టు 1న కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఎదుట నిర్వహించే ధర్నాలో ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని, పీఆర్సీని ప్రకటించి అమలు చేయాలన్నారు. పెండింగ్ డీఏలను వెంటనే చెల్లించాలని,సీపీఎస్ ను రద్దుచేసి, ఓపీఎస్ ను అమలు చేయాలని, 317 జీఓ వల్ల నష్టపోయిన ఉపాధ్యాయులందరినీ వారివారి సొంత జిల్లాలకు పంపించాలని ఉద్యోగ విరమణ పొందిన ఉపాధ్యాయులందరికీ పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని ఉపాధ్యాయుల సర్దుబాటు జీఓ 25 ను సవరించాలని, సమగ్ర శిక్ష ఉద్యోగుల 29 రోజుల సమ్మె కాలపు జీతాన్ని వెంటనే చెల్లించాలన్నారు. టైం స్కేల్ ఇవ్వాలని, వివిధ గురుకులాల్లో విధులు నిర్వహిస్తున్న గెస్ట్, పార్ట్ టైం అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులకు కనీస వేతనం ఇవ్వాలని, నూతన జిల్లాలకు డీఈఓ పోస్టులను, ప్రతి రెవెన్యూ డివిజన్కు డిప్యూటీ ఈఓ, నూతన మండలాలకు ఎంఈఓ పోస్టులను మంజూరు చేసి, ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు రూల్స్ను రూపొందించి, ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో యు ఎస్ పి ఎస్ భాగస్వామ్య సంఘాల వివిధ బాధ్యులు డిటిఎఫ్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ఆవాల నరహరి టి పి టి ఎఫ్ కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షుడు మర్రి అవినాష్ కోడిగూటి తిరుపతి టిపిటిఎఫ్ కరీంనగర్ జిల్లా కార్యదర్శి వేణుమాధవ్, రాజేందర్, సదానందం, చంద్ర శేఖర్, వనజ యేసుమణి, స్వామి, సంపత్,తదితరులు పాల్గిన్నారు.పాల్గొన్నారు.