ప్రశ్న ఆయుధం న్యూస్ డిసెంబర్ 4 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి
ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తు లక్ష్యాలను సాధించే విధంగాబాటలు వెయ్యాలి అని అన్నారు. రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి అశ్వాపురం మండలం గొందిగూడెం గిరిజన సంక్షేమ బాలురపాఠశాల, వసతి గృహం,మణుగూరు జడ్పీహెచ్ఎస్ పాఠశాల మరియు అశోక్ నగర్ ఎంపీపీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలు భాగంగా ఆయన పాఠశాలల్లో విద్యార్థులకు చేపట్టిన వసతి సదుపాయాలు, స్టోర్ రూమ్,మరుగుదొడ్లు,ల్యాబ్లు,వంటశాలలు మరియు స్టోర్ రూమ్ లో నిల్వ ఉంచిన ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేశారు. గొందిగూడెం గ్రామంలో గిరిజన ఆశ్రమ పాఠశాల లో మరుగుదొడ్లలో ట్యాప్ లు లీకేజీ ను గుర్తించిరిపేరు చేయించాల్సిందిగా ఆదేశించారు.వంటశాలలో మధ్యాహ్న భోజన పథకం మరియు వసతి గృహంలో విద్యార్థులకు ఒకే చోట వేరువేరు పదార్థాలు వండటం గమనించిన ఆయన ఒకే చోట విద్యార్థులకు వేరువేరు పదార్థాలు వడ్డించడం సరికాదని అందరికీ ఒకే రకమైన భోజనం అందించాలనిఆదేశించారు.విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలన్నారు. వంటశాలలో యంత్ర పరికరాలు పనిచేయకపోవడం, కట్టెల పొయ్యి మీదవండటం ఆయన గుర్తించి వెంటనే వంట పరికరాలని రిపేరు చేయించాల్సిందిగా ఆదేశించారు.
మణుగూరు జడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో వంటశాల మరియు తరగతి గదులను పరిశీలించి ఉపాధ్యాయులు విద్యార్థులకు ఏ విధంగా బోధిస్తున్నారు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఎనిమిదో తరగతి తెలుగు మీడియం గదిలో విద్యార్థులతో ముచ్చటించారు. కొంతమంది విద్యార్థులు కలెక్టర్,ఇంజనీర్ మరియు డాక్టర్ అవుతామనిఅన్నారు. ఇంజనీర్ డాక్టర్ చదవాలంటే తెలుగు మీడియం ఎందుకు ఎంచుకున్నారు అని ఆయన విద్యార్థులను అడిగారు. ఉన్నత చదువులు చదవాలంటే ఇంగ్లీష్ మీడియం మరియు ఇంగ్లీష్ లో పట్టు సాధించాలని విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు అవసరమైన అవగాహన కల్పించి వారి లక్ష్య సాధనకు బాటలు వేయాలన్నారు. అనంతరం ఉపాధ్యాయులతో మీటింగ్ నిర్వహించి పాఠశాలలో బైలింగ్ వెల్ విధానం,పాఠశాలల్లో సెమిస్టర్ పరీక్ష విధానం మరియు విద్యార్థుల్లో చదవడం మరియు వ్రాయడంలో నైపుణ్యం సాధించుటకు తీసుకోవలసిన చర్యలపై అభిప్రాయాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో రాష్ట్రంలో వివిధ పాఠశాలల్లో ఫుడ్ పాయిజనింగ్ జరిగి విద్యార్థులు అనారోగ్యం పాలు అవ్వడాన్ని తెలంగాణ విద్యా కమిషన్ సీరియస్ గా తీసుకుందని,అదేవిధంగా రాష్ట్రంలో విద్యార్థుల విద్యా ప్రమాణాలను పెంచడం లో భాగంగానే రాష్ట్రంలో విద్యార్థులకు సమగ్ర విద్యను అందించుటకు గాను నూతన విద్యా విధానం అమలు చేయడానికి తీసుకోవలసిన చర్యల గురించి రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అందరి అభిప్రాయాలు సేకరిస్తున్నామని, ఇది విద్యార్థుల భవిష్యత్తు కోసం ఏదో ఒక నిర్ణయం తీసుకోకుండా ప్రపంచవ్యాప్తంగా, ప్రవేట్ పాఠశాలల్లో,కార్పొరేట్ విద్యాసంస్థల అనుసరిస్తున్న విధానాన్ని పరిగణలోనికి తీసుకొని దీని ద్వారా రానున్న రోజుల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వం యొక్కలక్ష్యం అని అన్నారు.
ఈ తనిఖీలలో డిడి ట్రైబల్ వెల్ఫేర్ మణెమ్మ, విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర చారి, ఎస్సీ వెల్ఫేర్ అధికారి దాసరి అనసూయ, బీసీ వెల్ఫేర్ అధికారి ఇందిరా, మహిళా శిశు సంక్షేమ అధికారి లెనినా, కేబీవీపీ అధికారిని అన్నామలై మరియు ఎంఈఓ స్వర్ణ జ్యోతి, హెడ్మాస్టర్ జి.నాగశ్రీ, ఉపాధ్యాయులు మరియువిద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తుకి బాటలు వెయ్యాలి రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి రిటైర్డ్ ఐఏఎస్.
by Naddi Sai
Published On: December 4, 2024 6:10 pm