సంగారెడ్డి, సెప్టెంబరు 5 (ప్రశ్న ఆయుధం న్యూస్): ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా సంగారెడ్డి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. శుక్రవారం సంగారెడ్డి వైఎస్ ఆర్ భవన్ లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తోట భాస్కర్, ఆర్.కిష్టయ్య, కొంక రమేష్, మడపత్ చండీశ్వర్ స్వామి, నాగరాణి, అరవింద్ తదితరులను బీసీ సంక్షేమ సంఘం తరఫున శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్య నిర్వాహక అధ్యక్షుడు ప్రభుగౌడ్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు సమాజానికి దిక్సూచి లాంటివారు.. మార్గ నిర్దేశకులు అని, ఉపాధ్యాయులు లేనిది విద్యా వ్యవస్థ, సమాజం ఉన్నది సాధ్య పడదని అన్నారు. భారత దేశ ప్రథమ ఉప రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నామని, ప్రతి సంవత్సరం ఈ సంఘం తరఫున ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా గత 35 సంవత్సరాల నుండి జరుపుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోకుల్ కృష్ణ, జిల్లా అధ్యక్షుడు పట్లోళ్ల మల్లికార్జున పాటిల్, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వర స్వామి, ముఖ్య సలహాదారులు చంద్రయ్య స్వామి, కార్యదర్శి సుధాకర్ గౌడ్, మహిళా జిల్లా కార్యనిర్వాక అధ్యక్షురాలు నాగరాణి, మంగ గౌడ్, వీరమణి, జ్యోతి, వెంకటేశం, రవి, శ్రీనివాస్, శ్రీశైలం, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు సన్మానం
Oplus_131072