సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో విధులు నిర్వహించిన ఉపాధ్యాయులకు పారితోషికం చెల్లించాలి 

సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో విధులు నిర్వహించిన ఉపాధ్యాయులకు పారితోషికం చెల్లించాలి

 ప్రశ్న ఆయుధం – కామారెడ్డి

 

సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో విధులు నిర్వహించిన ఉపాధ్యాయులకు పారితోషికం చెల్లించాలని కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ పాలనాధికారి సయ్యద్ అహ్మద్ మసుర్ కు వినతి పట్రాన్ని పి ఆర్ టి యు తెలంగాణ కామారెడ్డి జిల్లా అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు అంబీర్ మనోహర్ రావు,జనపాల లక్ష్మీరాజం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే లో ఉపాధ్యాయులు తమ పాఠశాల విధులు నిర్వహిస్తూనే ఉదయం, సాయంత్రం వేళల్లో వివిధ రకాల ఇబ్బందులు ఎదుర్కొని సర్వే పూర్తి చేశారు. ప్రభుత్వం వారికి చెల్లించాల్సిన పారితోషికం తొందరగా చెల్లించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ వినతిపత్రం ఇచ్చినట్లు వారు తెలిపారు.

Join WhatsApp

Join Now