ముంబై, జూలై 2: విద్యార్థిని బలవంతంగా ఒప్పించి, అతడితో పలుమార్లు శృంగారంలో పాల్గొన్న ఉపాధ్యాయురాలిని పోలీసులు అరెస్టు చేశారు. బాధితుడు అదే పాఠశాలలో 12వ తరగతి చదువుతున్న విద్యార్థి. దేశంలోని ఐదు అత్యున్నత పాఠశాలల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ముంబైలోని స్కూల్లో ఈ ఘటన వెలుగుచూసింది. బాధిత బాలుడిని సదరు ఉపాధ్యాయురాలు తన వెంట బెట్టుకొని ఫైవ్ స్టార్ హోటళ్లు, ఇతర చోట్లకు తీసుకెళ్లి అతడితో శృంగారంలో పాల్గొన్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఆ ఉపాధ్యాయురాలి వేధింపులు తాళలేక బాధిత బాలుడు ఎట్టకేలకు ఘోరాన్ని బయటపెట్టాడు. 12వ తరగతి పరీక్షలు పూర్తయ్యాక ఒకానొక రోజు.. బాలుడిని వెంటబెట్టుకొని తీసుకురావాలంటూ అతడి ఇంటికి ఆ ఉపాధ్యాయురాలు తన పనివాణ్ని పంపింది.వెళ్లడం ఇష్టంలేని బాధితుడు, మహిళా టీచర్ వేధింపుల గురించి తన తల్లిదండ్రులకు చెప్పుకొన్నాడు. ఈ ఘటనపై దాదర్ పోలీసులకు బాధితుడి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. బాలుడి స్టేట్‌మెంట్‌ను పోలీసులు నమోదు చేశారు. ఉపాధ్యాయురాలి ప్రతిపాదనకు బాలుడు అంగీకరించకపోతే, మరో మహిళ ఆ బాలుడిని ఒప్పించిందని.. వయసులో తమకన్నా పెద్దవారైన మహిళలతో టీనేజర్లు లైంగిక సంబంధం పెట్టుకోవడం మామూలేనంటూ సదరు మహిళ బాధితుడితో అన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి సదరు ఉపాధ్యాయురాలిని పోలీసులు అరెస్టు చేశారు. ఆమెపై పోక్సో, కౌమార న్యాయ చట్టాల కింద కేసు నమోదు చేశారు. మహిళా టీచర్ చెప్పినట్లుగా వినాలని బాలుడిని ఒప్పించిన సదరు మహిళపైనా ఎఫ్‌ఐఆర్ నమోదైంది..
12వ తరగతి బాలుడితో టీచరమ్మ బలవంతపు శృంగారం!*
