సంగారెడ్డి, డిసెంబర్ 4 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి మండలంలోని నాగారం ప్రాథమిక పాఠశాలలో విశ్రాంత మండల విద్యాధికారి, అడ్వకేట్ డి.అంజయ్య విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధించడం వల్ల మానసిక ఆనందం కలుగుతుందని తెలిపారు. తాను సమయం లభించినప్పుడల్లా కొంత సమయాన్ని విద్యార్థులతో గడపడం వల్ల ఆనందం కలుగుతుందని అన్నారు. విశ్రాంత ఉపాధ్యాయులు మరియు విశ్రాంత ఉద్యోగస్తులకు తమకు దగ్గరలోని పాఠశాలకు వెళ్లి విద్యార్థులకు పాఠాలు చెప్పడం, నైతిక విలువలు నేర్పించడం, ఆటలు ఆడించడం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పిల్లలతో కొంత సమయం గడపడం వల్ల సమయం సద్వినియోగం అవుతుందని, దేశానికి ఉత్తమ పౌరులుగా తయారు చేయడానికి అవకాశం కలుగుతుందని ఆయన తెలిపారు. ఆసక్తి ఉన్నవారు సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులను కానీ లేదా సంబంధిత మండల విద్యాధికారిని కోరినట్లయితే వారు విద్యార్థులకు బోధించడానికి అనుమతి ఉపాధ్యాయులు ఇస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగారం పాఠశాల ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అనిత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
బోధన వల్ల మానసిక ఆనందం కలుగుతుంది: విశ్రాంత మండల విద్యాధికారి డి.అంజయ్య
Oplus_16908288