రామారెడ్డి మండలంలో టీచింగ్–లెర్నింగ్ మెటీరియల్ పోటీలు ఘనంగా
ప్రశ్న ఆయుధం రామారెడ్డి, సెప్టెంబర్ 2:
రామారెడ్డి మండల కేంద్రంలో టీచింగ్–లెర్నింగ్ మెటీరియల్ పోటీలు ఉత్సాహంగా జరిగాయి. విద్యార్థుల ప్రతిభ, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంతో పోటీ వేదిక పండుగలా మారింది.
తెలుగు విభాగంలో పోసానిపేట్ ప్రాథమిక పాఠశాలకి చెందిన ఇ. జోష్ణ దేవి ప్రథమ స్థానాన్ని దక్కించుకోగా, మద్దికుంట పాఠశాలకి చెందిన బి. శ్రీకాంత్ ద్వితీయ విజేతగా నిలిచారు.
ఇంగ్లీషు విభాగంలో తేజస్కర్ (కన్నాపూర్) మొదటి, స్వాతి (విసన్నపల్లి) రెండో స్థానాలు గెలుచుకున్నారు. గణిత విభాగంలో ఆంజనేయులు (రంగంపేట) ప్రథమ స్థానాన్ని, అర్జున్ (మొండివీరన్న తాండా) ద్వితీయ స్థానాన్ని సాధించారు. ఈవీఎస్ విభాగంలో కృష్ణప్రసాద్ (అన్నారం) ప్రథమ, నాగరాణి (రామారెడ్డి) ద్వితీయ విజేతలుగా ఎంపికయ్యారు.
జిల్లా స్థాయి పోటీలకు అర్హత సాధించిన విజేతలు రాష్ట్ర స్థాయిలో కూడా ప్రతిభ చాటాలని మండల ఉపాధ్యాయులు ఆకాంక్షించారు.