ముంపు గ్రామాల్లో ఎవరిని కదిలించిన కన్నీటి గాధలే

ప్రభుత్వం నుండి సాయం కోసం ఎదురుచూస్తున్న ముంపు గ్రామస్తులు

ముంపు గ్రామాల్లో ఎవరిని కదిలించిన కన్నీటి గాధలే

ప్రశ్న ఆయుధం ఆగస్టు 30 నిజామాబాదు

నిజామాబాద్: గత మూడు రోజుల క్రితం అకాలంగా కురిసిన భారీ వర్షాలకు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం లోని సిరికొండ మండలంలోని వాడీ, హోన్నజీపేట, కొండూరు, గడ్కోల్ గ్రామంలో ఆపారంగ ఆస్తి పంట నష్టాలు సంభవించాయి. మూడు రోజులైనా ఇంకా ఆ ప్రాంత గ్రామస్తులు భయం గుప్పెట్లోనే జీవనం కొనసాగిస్తున్నారు కొనసాగిస్తున్నారు. భారీ వర్షపు వరద నీటికి ఇంట్లోకి సైతం వరద నీరు రావడంలో ఇంట్లో ఉన్న వస్తువులు సైతం కొట్టుకుపోవడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు అలాగే వరద నీటితో ఇంట్లో ఉన్న బియ్యం బస్తాలు పూర్తిగా నాన్ని పోయాయని తినడానికి ఏమీ లేకుండా సర్వం వరద నీటిలో కొట్టకపోయాయని బాధితులు కన్నీటి పర్యంతం అయ్యారు. ఎవరో వచ్చి ఆహారం ప్యాకెట్లు అందిస్తే తప్ప తమకు వండుకోవడానికి ఏమీ లేని పరిస్థితి నెలకొందని వారు వాపోయారు. వాడి గ్రామంలోనైతే పరిస్థితి అత్యంత ఘోరంగా తయారయింది. విద్యుత్ సరఫరా మూడు రోజుల నుంచి లేకపోవడంతో నీతి సరఫరా అందక తాగడానికి కనీసం నీరు దొరకగా అవస్థలు ఎదుర్కొంటున్నామని వారు ఆందోళన వ్యక్తం చేశారు. వరద నీటి దాటికి ఇంకా బాడీ గ్రామంలో ఇంట్లో వర్షపు వరద నీరు ఇంకా ప్రజలు ఎత్తిపోస్తూనే ఉన్నారు. వేసిన పంట పూర్తిగా కొట్టకపోవడం జరగడమే కాకుండా పలు ఇండ్లు కూడా పూర్తిగా ధ్వంసం అయ్యాయని ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఎవరైనా దాతలు కానీ, ప్రభుత్వం కానీ తమను ఆదుకోవాలని ముంపు గ్రామస్తులు సాయం కోసం దీనంగా ఎదురుచూస్తున్నారు. ఇలా ముంపు గ్రామాల్లోని నాలుగు గ్రామాల్లో ఎవరిని కదిలించిన కన్నీటి గాథలే వినిపిస్తున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment