గుండ్లసింగారం బంజారా కాలనీలో తీజ్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా ముగింపు

గుండ్లసింగారం బంజారా కాలనీలో తీజ్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా ముగింపు

ఒకే వేదికపై 1500 కుటుంబాలు – ఆటపాటలతో వారాంతం సంబరాలు

ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎంపీ సీతారాం నాయక్

బంజారా భవన్ తప్పక శాంక్షన్ చేస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే

తీజ్ ఉత్సవాలకు రాష్ట్రంలో ప్రభుత్వ సెలవు వచ్చేలా సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ

ప్రశ్న ఆయుధం ఆగష్టు 23హనుమకొండ :

గుండ్లసింగారం బాలాజీ బంజారా కాలనీలో తీజ్ పండుగ ముగింపు వేడుకలు శనివారం అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రతి ఏటా రాష్ట్రంలోనే అతిపెద్ద ఎత్తున బంజారా కుటుంబాలు నిర్వహించే ఈ పవిత్ర ఉత్సవంలో ఈసారి 1500 కుటుంబాలు ఒకే వేదికపై ఆటపాటలతో, సాంస్కృతిక కార్యక్రమాలతో పాల్గొని పండుగను ఘనంగా జరిపాయి.తీజ్ ఉత్సవాల బుట్టల నిమజ్జనం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. “ఏక్ జాత్ – ఏక్ వాత్ – ఏక్ వాట్” నినాదాలతో బంజారా కుటుంబాలు ఏకతాటిపై నిలిచాయి.ఈ సందర్భంగా వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు మాట్లాడుతూ – “గుండ్లసింగారం లో ఇంత పెద్ద ఎత్తున తీజ్ ఉత్సవాలను నిర్వహించడం గర్వకారణం. బంజారా భవన్ నిర్మాణానికి తప్పక శాంక్షన్ తీసుకొస్తాను. వారం రోజుల్లో శంకుస్థాపన జరిగేలా చర్యలు తీసుకుంటాను” అని హామీ ఇచ్చారు. అలాగే తీజ్ పండుగకు రాష్ట్రస్థాయి ప్రాధాన్యం ఉండేలా, ఒక రోజు గవర్నమెంట్ హాలిడే ప్రకటించేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎంపీ ప్రొఫెసర్ సీతారాం నాయక్, రాకేష్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ బానోత్ కల్పన సింగ్ లాల్ తదితరులు పాల్గొన్నారు.కార్యక్రమాన్ని కార్పొరేటర్ లావుడియా రవి నాయక్, రాజు నాయక్ తీజ్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లాలోని పలువురు బంజారా నాయకులు, సీనియర్ సలహాదారులు, పెద్ద ఎత్తున మహిళలు, యువత, గ్రామ ప్రజలు, మీడియా మిత్రులు పాల్గొని ఉత్సవాన్ని విజయవంతం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment