మద్యం మత్తులో యువకుడు ఆత్మహత్య..!!

మంచిర్యాల: మద్యం మత్తులో యువకుడు ఆత్మహత్య

Jul 14, 2025,

కోటపల్లి మండల కేంద్రానికి చెందిన బొమ్మన సంపత్ (30) అనే వ్యక్తి మద్యం మత్తులో పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై రాజేందర్ సోమవారం తెలిపారు. ఈనెల 11న రాత్రి తాగిన మైకంలో పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి చెన్నూరు ఆసుపత్రికి అనంతరం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై పేర్కొన్నారు. మృతుడికి భార్య స్వప్న, సోదరుడు రాజేందర్ ఉన్నారు.

Join WhatsApp

Join Now