Site icon PRASHNA AYUDHAM

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గద్వాల జిల్లాకు రాక

ఎమ్మెల్సీ
Headlines in Telugu:

ఈనెల 31 వ తారీఖున మైనర్ బాలిక కుటుంబాన్ని పరామర్శించడానికి

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గద్వాల జిల్లాకు రాక

కొమ్మల ప్రవీణ్ రాజ్ తీన్మార్ మల్లన్న టీం జోగులంబ గద్వాల జిల్లా అధ్యక్షులు

జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం బీజ్వరం గ్రామంలో జరిగినటువంటి వడ్డెర మైనర్ బాలిక కుటుంబీకులను పరామర్శించడానికి ఈనెల 31వ తారీఖున ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు బిజ్వరం గ్రామానికి రాబోతున్నారు ఈ సందర్భంగా *కొమ్ముల ప్రవీణ్ రాజ్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ* జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్నటువంటి సామాజిక కార్యకర్తలు,రాజకీయ నాయకులు,విద్యార్థి సంఘ నాయకులు,బీసీ నాయకులు,యువత మరియు పార్టీలకు అతీతంగా ప్రజలు పెద్ద ఎత్తున ఈనెల 31 వ తారీఖున మల్దకల్ మండలం బిజ్వారం గ్రామంలో మైనర్ బాలిక కుటుంబీకులను పరామర్శించడానికి మల్లన్న గారు రాబోతున్నారు కాబట్టి పైన తెలిపిన వారు మరియు అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రింట్ మీడియా,ఎలక్ట్రానిక్ మీడియా,పత్రిక విలేకరులు,వివిధ రిపోర్టర్స్ బీజ్వరం గ్రామానికి రాగలరని తీన్మార్ మల్లన్న టీం జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు కొమ్ముల ప్రవీణ్ రాజ్ కోరడం జరిగింది. *ఈ కార్యక్రమంలో జోగులాంబ గద్వాల జిల్లా తీన్మార్ మల్లన్న జిల్లా కో కన్వీనర్ నీల నర్సింలు,కేటిదొడ్డి మండల్ కన్వీనర్ తిరుమలేష్ పాల్గొన్నారు.*

Exit mobile version