*సమగ్ర శిక్షా ఉద్యోగుల నిరవధిక సమ్మెకు మద్దతుగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం*
ఖమ్మం : కొత్త కలెక్టరేట్ ధర్నా చౌక్ నందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హనుమకొండలో సమగ్ర శిక్షా ఉద్యోగులకు ఇచ్చిన హామీ నెరవేర్చాలని గత కొన్ని రోజులుగా చేస్తున్న నిరవధిక సమ్మెకు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం స్టీరింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ కె.వి.కృష్ణారావు మద్దతు తెలుపుతూ మాట్లాడారు . వారి న్యాయబద్ధమైన కోరికలు సమాన పనికి సమాన వేతనం ,లేదా పే స్కేల్ అయినా చేయాలి లేదా క్రమబద్ధీకరణ చేయడం , ఆరోగ్య బీమా , ఉద్యోగ భద్రత వంటివి కల్పించమంటున్నారు గానీ ,గొంతెమ్మ కోరికలు ఏమి కోరట్లేదని అన్నారు . 2023లో బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి పిసీసీ ప్రెసిడెంట్ గా ఉండి మా గవర్నమెంట్ అధికారంలోకి వస్తే టీ తాగే లోపల సమగ్ర శిక్షా ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని అన్నది మీరే కదా, మీరు ఇచ్చిన హామీలను మీరే నెరవేర్చకపోతే ఎలా ,వెంటనే వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు . ట్రైబల్ వెల్ఫేర్ వారు 20 రోజులు సమ్మె చేస్తే సీతక్క వాళ్లకి క్రమబద్ధీకరణ చేపించారు. . ఆశా వర్కర్లు సమ్మె చేస్తే వారి జీతాలు పెంచారు . సమగ్ర శిక్షా ఉద్యోగులకు ఇచ్చిన హామీ నెరవేర్చమని అంటుంటే, ఎందుకు నెరవేర్చట్లేదు, వీల్లేం పాపం చేశారు అని ప్రశ్నించారు . ఈ కార్యక్రమంలో పెళ్ళూరి విజయకుమార్ , బాసాటి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు .